Mahesh Babu : గౌతమ్ కోసం ఇప్పటినుండే ప్లాన్ చేసిన మహేష్.. న్యూయార్క్ లోనే అంతా?

Mahesh Babu : టాలీవుడ్ లో నాలుగో జెనరేషన్ వారసుల ఎంట్రీ కోసం మెల్లిగా రెడీ అవుతున్నారు సీనియర్ స్టార్ హీరోలు. ఇప్పుడు అందరి కళ్ళు నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పైనే ఉన్నాయి. వచ్చే ఏడాదే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండనుందని తెలుస్తుంది. అలాగే వెంకటేష్ కొడుకుని కూడా రేపో మాపో ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ సినీ ఎంట్రీ పై కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా మహేష్ అభిమానులు గౌతమ్ ఫిల్మ్ ఎంట్రీ కోసం, అలాగే వీలైతే సితార ఎంట్రీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా గౌతమ్ ఫిలిం ఎంట్రీ గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

Mahesh Babu has already planned for his son Gautam's film entry

ఫిల్మ్ ఎంట్రీ కోసం న్యూయార్క్ లోనే ప్లాన్!

ఇక మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యామిలీ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తాడో తెలిసిందే. సినిమాల పై ఎంత ఫోకస్ చేసినా, అంత కంటే ఫ్యామిలీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అలాంటిది గౌతమ్ కెరీర్ పై ఎంత దృష్టి పెడతాడో తెలిసిందే. తాజాగా మహేష్ తనయుడు గౌతమ్ న్యూయార్క్ లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతూ ఉన్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబు న్యూయార్క్ లోనే ప్రముఖ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో గౌతమ్ ని చేర్పించే ప్లాన్ లో ఉన్నారట. తన డిగ్రీ అయ్యేంత వరకు అక్కడే నటలో శిక్షణ కూడా తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఫిల్మ్ ఎంట్రీ మాత్రం మరో మూడేళ్ళ తర్వాతే ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఇంతకు ముందే ఆల్రెడీ మహేష్ వన్ నేనొక్కడినే సినిమాలో గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

రాజమౌళి తో ఇయర్ ఎండింగ్ లో స్టార్ట్…

ఇక ఈ ఇయర్ గుంటూరు కారం తో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక దీనికోసం మహేష్ మూడు నెలల నుండి మేకోవర్ చేస్తున్నాడు. సినిమాకోసం లాంగ్ హెయిర్ ని కూడా పెంచుతున్నాడు మహేష్. ఇప్పటికే లీక్ అయిన లుక్స్ చూసి మహేష్ ఫ్యాన్స్ ఆతృతగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ రాజమౌళి సినిమా కాబట్టి ఖచ్చితంగా రెండేళ్లు పడుతుందని తెలిసిందే. ఇక జక్కన్న – మహేష్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ డెవలెప్మెంట్ పనులు అన్ని పూర్తయిపోగా త్వరలోనే గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపనున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు