Mahesh Babu : 93 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆ ఫీట్ సాధించిన ఏకైక హీరో మహేష్ బాబు

Mahesh Babu : రోజులు మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతాయి అని అంటారు. అలానే సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రికార్డ్ అంటే ఒక సినిమా ఎన్ని సెంటర్స్ లో ఆడింది ఎన్ని రోజులు ఆడింది అంటూ మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రికార్డ్స్ అంటే ఎంత వసూలు చేసింది అని అనుకుంటున్నారు. కేవలం కలెక్షన్స్ మాత్రమే ఇప్పుడు సక్సెస్ కి కొలమానం అయిపోయాయి. ఒకప్పుడు పల్లెటూర్లలో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని తెలియాలి అంటే గోడ మీద పోస్టర్స్ కనిపించేవి. కానీ ఈ రోజుల్లో అది చాలా అరుదుగా జరుగుతుంది.

ఇకపోతే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చాలా సినిమాలు కొన్ని నెలల వ్యవధిలోనే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఇంకొన్ని సినిమాలు కేవలం వారం రోజుల్లోనే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమా ఇంట్లో చూడాలి అని అంటే ఒరిజినల్ గా ప్రింట్ వస్తే ఆ డివిడి కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు వరల్డ్ సినిమా అంతా ప్రేక్షకుడి చేతిలో ఉంది అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ రోజుల్లో ఒక సినిమా 50 రోజులు 100 రోజులు ఆడటం కష్టమైపోయింది.

Guntur Kaaram

- Advertisement -

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా చాలా సంవత్సరాల తర్వాత 50 రోజులు ఆడింది. అలానే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా కూడా 50 రోజులు ఆడింది. ఈ తరుణంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఏకంగా 175 రోజులు పాటు ఆడింది. 93 ఏళ్ల సినిమా చరిత్రలో ఇది కేవలం మహేష్ బాబుకు మాత్రమే సాధ్యమైంది అని చెప్పొచ్చు దాదాపు 7 సినిమాలు మహేష్ బాబు నటించినవి 175 రోజులు పాటు ఆడాయి. ఇకపోతే చిలకలూరిపేటలో వెంకటేశ్వర థియేటర్ లో గుంటూరు కారం చిత్రం 175 వ రోజు ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈ సినిమాకి ముందు నెగిటివ్ టాక్ వచ్చి ఆ తర్వాత మహేష్ బాబుకి ఉన్న ఫ్యామిలీ ఫాలోయింగ్ వలన సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు