Mahesh Babu : మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీపై మహేష్ రివ్యూ

Mahesh Babu : ఇటీవల కాలంలో టాలీవుడ్ లో బిజీగా ఉన్న సీనియర్ నటులలో రావు రమేష్ కూడా ఒకరు. ఆయన హీరోగా మారుతూ చేసిన ఫస్ట్ మూవీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. తాజాగా ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు రియాక్ట్ అయ్యారు. మరి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీపై మహేష్ రివ్యూ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

మారుతి నగర్ సుబ్రహ్మణ్యంపై మహేష్ రివ్యూ

ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీకి లక్ష్మణ్ కార్య దర్శకత్వ వహించారు. రావు రమేష్‌తో పాటు ఈ చిత్రంలో నటీనటులు ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుప్లేటి, హర్ష వర్ధన్, అజయ్, ప్రవీణ్, అన్నపూర్ణ, శివన్నారాయణ పలువురు కీలక పాత్రలు పోషించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ పతాకాలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్యా నిర్మించిన “మారుతీ నగర్ సుబ్రమణ్యం” మూవీని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. సుకుమార్ భార్య తబిత సమర్పకురాలిగా రావడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ ఆగస్టు 23న థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమా హిలేరియస్ కామెడీతో ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Maruthi Nagar Subramanyam Movie Review: 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' సినిమా  రివ్యూ.. కడుపుబ్బా నవ్వించిన రావు రమేష్.. - Telugu News | Maruthi Nagar  Subramanyam Movie Review In Telugu Starrer Rao ...

- Advertisement -

తాజాగా ఈ మూవీ పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చారు. వాట్ ఏ హిలేరియస్ రైడ్… మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఒక బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఈ మూవీకి సమర్పకురాలైన తబితా సుకుమార్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్ర బృందంపై మహేష్ సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపించారు. దీంతో ప్రస్తుతం మహేష్ బాబు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీపై ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతుంది.

మూవీ స్టోరీ ఇదే

మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రంలో రావు రమేష్ తన భార్య, కొడుకుతో నివసించే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ గా నటించారు. ప్రభుత్వ ఉద్యోగిగా పని చేయాలనే ఏకైక లక్ష్యంతో నిరుద్యోగిగా మిగిలిపోతాడు. ఈ క్రమంలోనే కాంచన (రమ్య పసుపులేటి)తో అతని కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) ప్రేమలో పడతాడు. ప్రేయసి కోరిన మొబైల్ ఫోన్ కోసం కష్టపడుతుండగా, సుబ్రమణ్యం తన భార్య డబ్బు ఇవ్వడం మానేయడంతో సిగరెట్ కూడా కొనలేని స్థితిలో ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా సుబ్రహ్మణ్యం బ్యాంకు ఖాతాలో రూ. 10 లక్షలు వచ్చి పడతాయి. అసలు ఆ డబ్బును ఎవరు పంపారో తెలుసుకోకుండా ఖర్చు చేయడం కుటుంబం మొత్తాన్ని కష్టాల్లో పడేస్తుంది. డబ్బు పంపింది ఎవరో సుబ్రమణ్యం కనిపెడతాడా? ఈ 10 లక్షలు సుబ్రహ్మణ్యంను ఎలాంటి కష్టాల్లోకి నెట్టింది? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు ? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు