Mahesh Babu..ఇన్స్టా రీల్స్ కి అడిక్ట్ అయిన మహేష్… ఇదిగో ప్రూఫ్..!

Mahesh Babu.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఒకవైపు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును పలు సేవా సంస్థలకు ఉపయోగిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే ఆయన ఇన్ స్టా రీల్స్ కి అడిక్ట్ అయ్యారు అని.. అందుకు సంబంధించిన సాక్షాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలతో సహా వైరల్ అవ్వడం గమనార్హం. సెల్ ఫోన్.. ఉదయం లేచిందే మొదలు అర్ధరాత్రి అయినా సరే టైం తెలియకుండా ఉపయోగించే ఒకే ఒక్క సాధనం.. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సెల్ ఫోన్ లేనిదే సమయం గడవదు.. అంతలా అడిక్ట్ అయిపోయారు.. ఇక వరుస సినిమాలు.. సేవా సంస్థలు, యాడ్స్ అంటూ ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఫోన్ కి అడిక్ట్ అయ్యారని.. బహుశా చాలామందికి తెలియదనే చెప్పాలి.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఈవెంట్లో వెల్లడించారు కూడా. అయితే ఇప్పుడు ఆయన ఇన్స్టా రీల్స్ కి కూడా బాగా అడిక్ట్ అయ్యారని తెలుస్తోంది..

ప్రభాస్ రీల్ కి లైక్ కొట్టిన మహేష్ బాబు..

Mahesh Babu.. Mahesh who is addicted to Insta Reels... Here is the proof..!
Mahesh Babu.. Mahesh who is addicted to Insta Reels… Here is the proof..!

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898AD ..ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మొన్న సాయంత్రం ముంబై లో ఘనంగా నిర్వహించారు.. ఈ నేపథ్యంలోనే ఈవెంట్ ముంబైలో జరగగా.. ఈవెంట్ కి ప్రత్యేకంగా బయలుదేరారు ప్రభాస్.. ఇందులో భాగంగానే ఆయన లుక్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా చాలామంది అభిమానులు ప్రభాస్ లుక్ ను షేర్ చేస్తూ ఇన్స్టాలో వైరల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రీల్ చూసిన మహేష్ బాబు.. చూడడమే కాదు ఏకంగా లైక్ కూడా చేశారు.. ఇప్పుడు ఈ విషయాలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మహేష్ బాబు కూడా రీల్స్ కి అడిక్ట్ అయిపోయారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఇన్ స్టా రీల్స్ కి అడిక్ట్ అయిన మహేష్ బాబు..

నిజానికి ఫోన్ కి ఎప్పుడో అడిక్ట్ అయిపోయారు మహేష్ బాబు.. ఇదే విషయాన్ని గత ఏడాది.. ప్రముఖ మొబైల్ సంస్థ బిగ్ సి 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన మహేష్ బాబు.. తాను స్మార్ట్ ఫోన్ కి బానిస అయ్యానని క్లారిటీ ఇచ్చారు.. ఒక్కొక్కసారి తలనొప్పి వచ్చి పక్కన పడేస్తూ ఉంటారట.. ఉదయం లేవగానే అలాగే రాత్రి పడుకునే ముందు కచ్చితంగా సెల్ ఫోన్ చూస్తానని.. అయితే దీనిని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఇంకా అలవాటు మానుకోలేకపోతున్నానని క్లారిటీ ఇచ్చారు మహేష్ బాబు.. ఏది ఏమైనా మహేష్ బాబు ఇలా ప్రభాస్ ఇన్స్టా రీల్ చూసి లైక్ కొట్టడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ విషయాలను మరింత వైరల్ గా మారుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు