Raayan : ధనుష్ రాయన్ పై మహేష్ బాబు ప్రశంసలు..

Raayan : కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ‘రాయన్’ సినిమా థియేటర్లలో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక ధనుష్ రాయన్ సినిమాలో నటించడం మాత్రమే కాకుండా ఆ సినిమాకి దర్శకత్వం కూడా వహించిన విషయం తెలిసిందే. ముందు నుండే ఈ సినిమాపై మంచి అంచనాలుండగా, భారీ తారాగణం సినిమాలో నటించారు. ఇక జులై 26న రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడిగా మొదటి సినిమాతోనే ధనుష్ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం మూడు రోజుల్లోనే ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ని కూడా బ్రేక్ చేసి వంద కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ధనుష్ రాయన్ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించాడు.

Mahesh Babu praises Raayan movie unit

రాయన్ పై మహేష్ బాబు ప్రశంసలు..

ఇక ధనుష్ రాయన్ సినిమా విడుదలైన ప్రీమియర్స్ నుండే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుండగా, ఈ సినిమాని చూసిన పలువురు సినీ ప్రముఖులు చిత్ర యూనిట్ ని అభినందిస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు. తాజాగా రాయన్ చిత్రాన్ని చూసిన మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా రాయన్ సినిమాపై అలాగే నటించి దర్శకత్వం వహించిన ధనుష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ బాబు ట్విట్టర్ లో స్పందిస్తూ… రాయన్, ధనుష్ స్టెల్లార్ యాక్ట్.. అద్భుతంగా దర్శకత్వం వహించి, నటనను ప్రదర్శించారు. ఎస్.జే. సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ మరియు కీలక నటీనటులు తమ అత్యుత్తమ ప్రదర్శన అందించారు.. మాస్ట్రో రెహమాన్ ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్ సూపర్ అని మహేష్ బాబు ప్రశంసించారు. రాయన్ ప్రేక్షకులు తప్పక చూడవలసిన చిత్రం అని అన్నారు.

- Advertisement -

నూట యాభై కోట్ల దిశగా రాయన్…

ఇక మహేష్ బాబు రాయన్ చిత్ర యూనిట్ కి, దర్శక నిర్మాతల మొత్తం టీమ్‌ కి తన తన అభినందనలు తెలిపారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన రాయన్ లో సెల్వ రాఘవన్, జయరామ్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఇప్పటికే 75 కోట్ల మార్క్ దాటేసిన రాయన్ సినిమా మరో రెండు రోజుల్లో వంద కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయం. ఇక లాంగ్ రన్ లో రాయన్ సినిమా నూట యాభై కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు