MaheshBabu : జక్కన్న మూవీ ఇప్పట్లో లేదని ఇవి ఫ్యాన్స్.. మొహం మీద పడేస్తున్నారా..?

MaheshBabu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇయర్ “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో భారీ అంచనాలతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, మహేష్ బాబు వన్ మ్యాన్ షో తో భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా 180 కోట్ల వసూళ్లు సాధించి మహేష్ బాబు స్టామినా చూపించింది. ఇదిలా ఉండగా మహేష్ బాబు ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించబోయే ఈ సినిమా ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం. అయితే జక్కన్న సినిమా ఇంకా మొదలే పెట్టలేదు కానీ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మహేష్ – జక్కన్న సినిమా గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది.

Mahesh Babu Rajamouli movie will take 4 years to release

జక్కన్న సినిమా ఇప్పట్లో కష్టమే?

ఇకపోతే మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాను శ్రీ దుర్గ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత K.L.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో 700 కోట్ల బడ్జెట్ ఈ సినిమాకు అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ ఆల్రెడీ నాలుగు నెలల నుండి లాంగ్ హెయిర్, గడ్డం కూడా పెంచుతున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫిక్స్ అయ్యి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు షూటింగ్ మొదలుపెట్టలేదు. అయితే SSMB29 ప్రాజెక్ట్ మొదలు పెడితే పూర్తి కావడానికి ఏకంగా 3 నుండి 4 ఏళ్ళు పట్టొచ్చని సమాచారం. అంటే సిల్వర్ స్క్రీన్ పై మహేష్ బాబు దర్శనం 2027 వరకు టైం పెట్టొచ్చని తెలుస్తుంది. ఇది నిజంగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

- Advertisement -

ఫ్యాన్స్ ని కూల్ చేయడానికే వీటిని వదులుతున్నారా?

ఇకపోతే చాలా మంది నెటిజన్లు కూడా మహేష్ బాబు జక్కన్న సినిమా మినిమం మూడేళ్లు పడుతుందని అంటున్నారు. అందుకే మహేష్ బాబు సన్నిహిత వర్గం ఫ్యాన్స్ కూల్ చేయ్యడానికి తాను నటించిన సినిమాల రీ రిలీజ్ లు చేస్తున్నారని సమాచారం. ఆల్రెడీ ఈ బర్త్ డేకి మురారి సినిమా ని రీ రిలీజ్ చేస్తుండగా, నెక్స్ట్ టైం ఖలేజా రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇక మురారి రీ రిలీజ్ కి అయితే స్పెషల్ వెడ్డింగ్ కార్డ్, కృష్ణ వంశీ ఇంటర్వ్యూలు కూడా బాగా వైరల్ అయ్యాయి. దాంతో సినిమా రీ రిలీజ్ కి మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. వీటి తర్వాత అతడు, సైనికుడు సినిమాలను కూడా రీ రిలీజ్ చేసి, మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా చేసే ప్లాన్ లో ఉన్నారట. అయితే ఎన్ని రీ రిలీజ్ లు చేస్తే మాత్రం, నాలుగేళ్లు మహేష్ సినిమా రావడంలేదంటే ఫ్యాన్స్ హర్ట్ అవకుండా ఉంటారా అని నెటిజన్లు అంటున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు