Mahesh Babu – RGV: ఈ క్రేజీ కాంబోలో మిస్సయిన మూవీ ఏంటో తెలుసా..?

Maheshbabu – RGV.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్లు అనుకోకుండా సెట్ అవుతాయి.. అనుకోకుండా డ్రాప్ అవుతూ ఉంటాయి.. అయితే ఏ కాంబినేషన్ ఏ కారణంగా ఆగిపోయిందో చెప్పడం అసాధ్యం. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు – క్రేజీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమా ఆగిపోయిందట.. అసలు ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వడమే ఒక ఎత్తైతే.. అందులో ఆ సినిమా ఆగిపోవడం మరొక ఎత్తు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Mahesh Babu - RGV: Do you know which movie is missing in this crazy combo?
Mahesh Babu – RGV: Do you know which movie is missing in this crazy combo?

కోట్లు ఇచ్చిన బాలీవుడ్ కి నో అంటున్న మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు.. బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాతలు మహేష్ బాబుతో సినిమాలు చేయాలని.. ఎక్కువ పారితోషకం ఇస్తామని ముందుకు వస్తున్నా.. హిందీలో మాత్రం సినిమాలు చేయడానికి మహేష్ బాబు ఒప్పుకోలేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న పాన్ వరల్డ్ సినిమాకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే జర్మనీకి వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నారు మహేష్ బాబు.

మహేష్ బాబు – వర్మ కాంబినేషన్లో మూవీ ఆగిపోవడానికి కారణం..

ఇదిలా ఉండగా మరోవైపు తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో చెరగని ముద్ర వేసుకున్న రాంగోపాల్ వర్మ తొలిచిత్రం శివ తోనే పరిచయమై చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది యువకులు వర్మాను స్ఫూర్తిగా తీసుకొని దర్శకులవడానికి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.. ప్రస్తుతం అగ్ర దర్శకులుగా కొనసాగుతున్న చాలామంది డైరెక్టర్లు ఈయన దగ్గర శిష్యరికం చేసిన వారే. ఇక నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రాంగోపాల్ వర్మ .. మహేష్ బాబుతో తొలి సినిమా చేయాల్సి ఉంది ..ఒక కథ తీసుకొని కృష్ణ ను కలిశారు.. ఈ కథతోనే సినిమా చేద్దామనుకున్న వర్మ తో.. కృష్ణ తన ఈ కథ నచ్చలేదు కాబట్టే మరో కథ తీసుకురావాలని..దాంతో చేద్దామని చెప్పారట కృష్ణ.. అయితే వర్మ చేస్తే ఈ కథనే సినిమాగా చేస్తాను.. మరో కథతో సినిమా చేయను అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారట. దీంతో వర్మ – మహేష్ బాబు కాంబినేషన్లో రావాల్సిన సినిమా కృష్ణ వల్ల ఆగిపోయింది.

- Advertisement -

వర్మతో సినిమా చెయ్యకపోయినా శిష్యులతో..

అయితే వర్మ తో మహేష్ బాబు సినిమా తీయకపోవచ్చు కానీ వర్మ శిష్యులు చాలామందితో మహేష్ బాబు సినిమాలు చేశారు. అలా వర్మ శిష్యులైన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు పోకిరి, బిజినెస్ మాన్ చిత్రాలు చేయగా.. కృష్ణవంశీతో మురారి, గుణశేఖర్ తో ఒక్కడు, అర్జున్, సైనికుడు చిత్రాలు చేశారు మహేష్ బాబు.. మొత్తానికైతే గురువుతో సినిమా అవకాశం కోల్పోయిన ఆయన.. శిష్యులతో సినిమాలు చేసి విజయాన్ని సాధించారు.. ఇకపోతే ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. ఇకపోతే మరోవైపు వర్మ శారీ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా.. ఇంకొక వైపు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తన 29వ సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు.. మరి ఇద్దరి కాంబినేషన్ తెరపై ఎప్పుడు వస్తుందో..అసలు వస్తుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు