Mahesh Babu : స్టార్ హీరోయిన్ ను దారుణంగా ఏడిపించిన మహేష్… ఎవ్వరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టిన సీనియర్ నటి

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలావరకు ప్రేక్షకులకు అన్ని విషయాలు తెలుసని చెప్పాలి. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఎవరో ఒకరు బయటపెట్టే వరకు అవి సీక్రెట్స్ గానే మిగిలిపోతాయి.. తాజాగా మహేష్ బాబు ఓ స్టార్ హీరోయిన్ ను దారుణంగా ఏడిపించాడు అన్న విషయాన్ని ఓ సీనియర్ నటి బయట పెట్టి షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే?

హీరోయిన్ ను ఏడిపించిన మహేష్

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ఆగస్టు 9న ఆయన అభిమానుల కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన క్లాసిక్ మూవీ మురారి రీరిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత మురారి మూవీ మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. మహేష్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ మూవీ స్పెషల్ షోలను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీని ఏకంగా 300కు పైగా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే మురారీలఓ కీలకపాత్రలో  నటించిన నటీనటులు తమ మెమోరీస్ ను మరోసారి నెమరు వేసుకుంటున్నారు. అందులో భాగంగానే సీనియర్ నటి సుధ కూడా మురారి సెట్లో జరిగిన ఒక సీక్రెట్ ను వెల్లడించింది.

సినిమాలో ఒకానొక సమయంలో హీరోయిన్ ను ఏడిపించే సీను ఉంటుందని గుర్తు చేసుకుంది. అయితే అప్పట్లో తాను మహేష్ ఇద్దరు కలిసి సోనాలి బింద్రేని డైరెక్టర్ చెప్పకపోయినా కావాలనే ఏడిపించారట. అయితే ఈ విషయాన్ని కనిపెట్టిన హీరోయిన్ షూటింగ్ అయిపోయాక డైరెక్ట్ గా ఆగేసిందట. ఇలా అప్పట్లో మరచిపోలేని మంచి ఎన్నో విశేషాలు మురారి సెట్ లఓ చోటు చేసుకున్నాయని ఓ స్పెషల్ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది సుధ. అంతేకాకుండా తాను మహేష్ బాబుతో కలిసి మురారి, అతడు వంటి పలు సినిమాల్లో నటించే అవకాశం దక్కినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక వీరిద్దరూ కలిసి హీరోయిన్ ను సెట్లో ఆటపట్టించిన విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. సుధ బయట పెట్టేదాకా ఈ విషయం ఎవ్వరికీ తెలియదనే చెప్పాలి.

- Advertisement -

Murari Movie || Mahesh Babu & Sonali Bendre Beautiful Love Scenes || Mahesh  Babu, Sonali Bendre

సోనాలి బింద్రే డెబ్యూ

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి మూవీతోనే మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఆయన కెరీర్ లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మురారి మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. మురారిలోని పాటలు అప్పట్లో మూవీ లవర్స్ ను ఓ ఊపు ఊపేసాయి. ఇక హీరోయిన్ సోనాలి బింద్రే ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన మురారి మూవీ ఏకంగా మూడు నంది అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. మరి రీ రిలీజ్ కాబోతున్న మురారికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు