Mahesh Babu : “ఆలస్యం అమృతం” ఇది బాబు గారికి సరిగ్గా సెట్ అవుతుంది… మళ్లీ ఫ్లైట్ ఎక్కేస్తున్న మహేష్

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తన నెక్స్ట్ మూవీ గురించి ఏమాత్రం టెన్షన్ పడకుండా వరుసగా టూర్లు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఎయిర్ పోర్టులో మరోసారి దర్శనం ఇచ్చారు. మరి మహేష్ ఎక్కడికి వెళ్తున్నారు ? అంటే….

ఆలస్యం అమృతం

ఆలస్యం అమృతం అనే సామెతను వినే ఉంటారు. ఇటీవల కాలంలో మహేష్ బాబు పంథా చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. తన సినిమా లేట్ అవుతుంది అనే టెన్షన్ ఏ మాత్రం లేకుండా ఫుల్ వెకేషన్ తో చిల్ అవుతున్నాడు. టైం దొరికితే చాలు ఫ్లైట్ ఎక్కి టూర్స్ వెళ్ళిపోతున్నాడు. ఇదివరకు సినిమా షూటింగ్ పూర్తయ్యాక, నెక్స్ట్ సినిమా చేసే ముందు గ్యాప్ తీసుకుని, లేదంటే స్పెషల్ అకేషన్స్ లో మాత్రమే మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లేవారు. కానీ రాజమౌళితో సినిమా ఒప్పుకున్న తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. ఇటీవల కాలంలో ఎప్పుడు చూసినా ఎయిర్ పోర్ట్ లోనే సరికొత్త లుక్ తో దర్శనమిస్తూ, హాట్ టాపిక్ అవుతున్నాడు. తాజాగా ఎయిర్ పోర్టులో మరోసారి స్టైలిష్ గా మహేష్ మెరిసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో మహేష్ బాబు ఎక్కడికి వెళ్తున్నాడు? అని ఆరా తీయడం మొదలు పెట్టారు సూపర్ స్టార్ అభిమానులు.

Mahesh Babu new airport look

- Advertisement -

దుబాయ్ ట్రిప్

SSMB 29 కోసం చిత్రబృందం అంతా కలిసి వరుసగా విదేశాలకు ట్రిప్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా, ఇటీవలే దుబాయ్ వెళ్లొచ్చారు. హీరో మహేష్ బాబు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత కెఎల్ నారాయణ రీసెంట్ గానే దుబాయ్ నుండి తిరిగి వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు.

రాజమౌళి సినిమా ఆలస్యం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రూపొందాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఇంకా అధికారికంగా మూవీని మొదలు పెట్టలేదు. సినిమా స్టార్ట్ చేయడానికంటే ముందే మహేష్ గురించి రాజమౌళి దేశ విదేశాల్లో ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. ఇటీవల కాలంలో జపాన్ వెళ్లి అక్కడ మీకు స్టైలిష్ హీరోని పరిచయం చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అప్పుడప్పుడు చిత్ర బృందం బయటకు వచ్చి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అంటూ చెప్పారు. కానీ అఫీషియల్ గా ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అన్నది కనీసం రాజమౌళికైనా ఐడియా ఉందా లేదా అని అనిపిస్తోంది ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే. రాజమౌళి సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. కానీ మరోవైపు ఈ ప్రాజెక్టు గురించి ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ లో అసహనం పెరుగుతోంది. ఇక మహేష్ బాబు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ అంటూ దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు