Vijaysethupathi : మిల్క్ బాయ్ మహేష్ లాగా అవ్వాలనుకున్న.. ఇన్నాళ్లకు బయటపడ్డ మనసులో మాట..

Vijaysethupathi : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అమ్మాయిల క్రష్ అన్న విషయం తెలిసిందే. ఆయన అందానికి అమ్మాయిలు పడి పోతారు.. అమ్మాయిల రాకుమారుడు మాత్రమే కాదు సెలెబ్రేటీలల్లో కూడా మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. తెలుగు స్టార్స్ తో పాటుగా తమిళ హీరోలు కూడా మహేష్ బాబు నటనకు ఫిదా అవుతున్నారు. తమిళ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన విజయ్ సేతుపతి ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఆయన తెలుగు సినిమా హీరోల గురించి చెప్పాడు. మహేష్ బాబు అంటే అతనికి చాలా ఇష్టం అని చెప్పాడు. అతను నటించిన సినిమాల్లో అతడు సినిమా అతన్ని బాగా మోటివేషన్ చేసిందని ఆయన అన్నాడు. తన కష్టకాలంలో ఈ అతడు సినిమాను చాలాసార్లు చూసినట్లు ఆ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపాడు. మొదట షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ.. తర్వాత తమిళ ఇండస్ట్రీలో ఓ నటుడిగా నిలదొక్కుకోవడానికి విజయ్ చాలానే శ్రమించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈ సినిమా నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు చెప్పాడు. అప్పటిలో మహేష్ బాబు లాగా అవ్వాలని అనుకున్నట్లు ఆ ఇంటర్వ్యూ లో చెప్పడం అందరిని ఆకట్టుకుంది. అతని నటన బాగా నచ్చిందని చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Mahesh Babu's movie and then Vijay Sethupathi's sensational comments
Mahesh Babu’s movie and then Vijay Sethupathi’s sensational comments

మహేష్ బాబు కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా అతడు. 2005లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో అన్ని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మహేష్ నటనకు ఫిదా కాని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. నెగిటివ్ షెడ్ లో వచ్చినా అతని డైలాగులు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి ఆ సినిమా పాటలు వినిపిస్తున్నాయి అంటే మామూలు విషయం కాదు. ఇక మహేష్ ఇప్పటికి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాజమౌళితో 29 వ సినిమా చేస్తున్నాడు.

- Advertisement -

ఇక విజయ్ సేతుపతి సినిమా విషయానికొస్తే.. విలక్షణ నటుడుగా వరుస సినిమాలు చేస్తున్నాడు. మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అతని కెరీర్లో ఇది 50వ సినిమా కావడం విశేషం. అదిరిపోయే ట్విస్టులు ఉన్న ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఓటీటీలోకి వచ్చిన మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు