Murari ReRelease : అడ్వాన్స్ సేల్స్ లో సూపర్ స్టార్ ప్రభంజనం.. అన్నీ బ్రేక్ అయ్యేలా ఉన్నాయే!

Murari ReRelease : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు పాతికేళ్లుగా తన సినిమాలతో ఎన్నో రికార్డులు, అవార్డులను సాధించాడు. అంతకుమించి ఎన్నో చారిటిలతో, ప్రజా సేవలతో ఎంతో మంది చిన్నారులకు సేవలనందిస్తున్నాడు. ఇక ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో వన్ మ్యాన్ షో తో అదరగొట్టగా, త్వరలోనే ఎస్.ఎస్. రాజమౌళితో పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా ఆగస్టు 9న మహేష్ బాబు నటించిన ‘మురారి’ సినిమా రీ రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 9న రీ రిలీజ్ కి రెడీ అవుతుండగా, మహేష్ అభిమానులు భారీ ఎత్తున సినిమా రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

Mahesh Babu's Murari movie ReRelease has crossed 1 crore mark in advance bookings

అడ్వాన్స్ సేల్ లో మురారి రికార్డులు…

ఇక మహేష్ బాబు నటించిన మురారి (Murari ReRelease) రీ రిలీజ్ పై ముందుగా ఆసక్తిలేకపోగా, రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ ఈ సినిమా కోసం ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. రీ రిలీజ్ ట్రెండ్స్ లో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేసిన మహేష్ బాబు మురారి తో మరోసారి రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్ గా వస్తున్న ‘మురారి’ సినిమాకి రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా 1 కోటి రూపాయల మార్క్ ని దాటేసిందని సమాచారం. కేవలం బుకింగ్స్ తోనే ఈ రేంజ్ అనే మరి ఫస్ట్ డే ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు మాత్రమే కాకుండా తమ ఫ్యామిలీ తో సహా వచ్చి సినిమా చూసేట్టుగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

- Advertisement -

ఫస్ట్ డే రికార్డులు బ్రేక్ అవుతాయా?

ఇక రీ రిలీజ్ సినిమాకి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ తో మాస్ బుకింగ్స్ ని చూపించడం, మహేష్ బాబుకే సాధ్యం అయ్యింది అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు అల్ టైం రీ రిలీజ్ ఓపెనింగ్స్ లో ఖుషి 5 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, స్థానంలో సింహాద్రి సినిమా ఉంది. ఈ సినిమాలని బ్రేక్ చేసి మురారి కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఇక మురారి మాత్రమే కాకుండా కొన్ని చోట్ల ఒక్కడు కూడా స్పెషల్ షో వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు