Rajamouli : ఏంటి రాజమౌళి గారు.. అంత పెద్ద తప్పు చేసి సైలెంట్ గా ఉంటారే..

Rajamouli : సినీ ఇండస్ట్రీలో హీరోల బర్త్ డే లు వస్తున్నాయంటే హడావిడి ఏ రేంజులో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఒకవైపు ఫ్యాన్స్ , మరొకవైపు వాళ్ళు చేస్తున్న సినిమాల నుంచి ప్రత్యేకమైన అప్డేట్స్ వదులుతారు. ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో బర్త్ డే అంటే ఏ రేంజులో ఉంటుందో కదా. అవును నిజమే . రీసెంట్ గా మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలను తన ఫ్యాన్స్ గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు చేసిన హంగామా అందరికీ తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు మహేష్‌కు స్పెషల్‌గా బర్త్ డే విషెస్‌ను అందించారు. అనిల్ రావిపూడి, సందీప్ వంగా వంటి వారు కూడా ట్వీట్లు వేశారు.. కానీ రాజమౌళి మాత్రం ఎటువంటి అప్డేట్ ను ఇవ్వలేదు. అసలు కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

మహేష్ బాబు తన 29 వ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళితో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు అంత ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే .. రాజమౌళి తన సోషల్ మీడియా ఖాతాల్లో ఎక్కడా కూడా మహేష్ బాబు బర్త్ డే గురించి స్పందించినట్టుగా కనిపించడం లేదు. దీంతో రాజమౌళి మహేష్ బాబు రిలేషన్ మీద ట్విట్టర్లో చర్చలు నడుస్తున్నాయి. అంతా సవ్యంగానే ఉందా? తన హీరోకి రాజమౌళి ఎందుకు విషెస్ చెప్పలేదు? అసలేమైందనే వివాహస్యం పై వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం పర్సనల్ గా కూడా చెప్పలేదని ప్రిన్స్ ఫ్యాన్స్ కు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Mahesh fans angry with Rajamouli for not giving ssmb29 update
Mahesh fans angry with Rajamouli for not giving ssmb29 update

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అయితే SSMB 29 నుంచి ఏదో ఒక అప్డేట్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినట్టుగానే కనిపిస్తుంది.. ఇక ఇప్పటికి కూడా జక్కన్న స్పందించలేదు. దీనిపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి రాజమౌళి గారు.. అంత పెద్ద తప్పు చేసి సైలెంట్ గా ఉంటారే..కనీసం మహేష్ తో సినిమా చేస్తున్నారా లేదా అన్నదైన చెప్తారా అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక మహేష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన మురారి సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి.. సినిమా చూస్తూనే.. అలనాటి రామచంద్రుడు పాట వచ్చే టైంకి తాళి కట్టేశారు. ఇలా చాలా చోట్ల చాలా జంటలు పెళ్లిళ్లు చేసుకున్నాయి. వీటికి సంభందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు