SSMB29 Update : మహేష్ ఫ్యాన్స్ రెడీ అవండమ్మా.. అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుంది..

SSMB29 Update : తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటించబోతున్నాడు.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 29 వ సినిమాను చెయ్యబోతున్నాడు మహేష్.. ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అయితే జక్కన్న మాత్రం అదిగో ఇదిగో అని ఊరిస్తూ వస్తున్నాడు.. కానీ సినిమా షూటింగ్ ను మాత్రం మొదలు పెట్టలేదు.. కాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ రాబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది..

జక్కన్న ఈ సినిమాను ప్రకటించి దాదాపు రెండేళ్లు పూర్తి కావొస్తున్న కూడా ప్రీ ప్రోడక్షన్ పనులు పూర్తి చెయ్యకపోవడం గమనార్హం.. స్క్రిప్ట్ కూడా ఇంకా పూర్తి కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో వారందరికి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.. ఆగష్టు లో మహేష్ బర్త్ డే సందర్బంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వడానికి జక్కన్న టీమ్ రెడీ అవుతున్నట్లు టాక్..

Mahesh fans be ready An exciting update is coming..
Mahesh fans be ready An exciting update is coming..

అంతేకాదు ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్ ను పూర్తిగా మార్చేశాడు.. ఆ లుక్ కోసం ప్రిన్స్ బాగా కష్టపడ్డాడు.. ఇప్పటికే మహేష్ కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. మహేష్ బర్త్ డే రోజున ఈ సినిమాలోని ఫైనల్ లుక్ ను రిలీజ్ చెయ్యనున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో ఇప్పటికే షికారు చేస్తుంది.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ అంటూ మహేష్ బర్త్డేను అలర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.. త్రిపుల్ ఆర్ సినిమా లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా పై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. పాన్ వరల్డ్ తెరకెక్కుతున్న ఈ సినిమా పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు