ఏపీ సర్కారు వారి మాట

సర్కార్ వారి పాట ఈ సినిమా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచుస్తున్న సినిమా ఇది. నిన్న రిలీజ్ అయినా ట్రైలర్ ట్రెండింగ్ లో ఉండటమే కాకుండా మహేష్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. అప్పుడెప్పుడో మహేష్ లో చూసిన ఎనర్జీ మళ్ళీ ఈ ట్రైలర్ లో కనిపించింది. ఈ ట్రైలర్ లో కనిపించే ఫైట్స్ , డైలాగ్స్ , కామెడి వీటన్నింటికి కంటే ఒక డైలాగ్ మాత్రం అందరిని ఆలోచింపజేస్తుంది.

“నేను ఉన్నాను – నేను విన్నాను” ఈ డైలాగ్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన యాత్ర అనే సినిమాలోది. దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవితంలోని ముఖ్యమైన ఘట్టం పాదయాత్ర, దాన్ని బేస్ చేసుకునే ఆ సినిమాని నిర్మించారు. కాకపోతే ఆ సినిమాలో ఈ డైలాగ్ చాలా ఎమోషనల్ సీన్ లో వినిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఏపీ సీఎం జగన్ కూడా ఈ మాటను చాలా సార్లు తన ప్రచారంలో వాడారు.

ఇప్పుడు సర్కారు వారి పాటలో ఇదే డైలాగ్ ను మహేష్ కీర్తి సురేష్ తో చెప్తాడు. అసలు ఈ డైలాగ్ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి అని ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్స్ పెంచమని కోరుతూ పలువురు పెద్దలు జగన్ ను కలిసిన విషయం మనకు తెలిసిందే అందులో మహేష్ బాబు కూడా ఒకరు. ఒకవేళ జగన్ ను మెప్పించడానికి ఇలా చేసారా అనే ఆలోచనలు కూడా కొందరికి వస్తున్నాయి. వీటన్నింటిని పక్కన పెడితే ఇప్పటివరకు జగన్ ను కలిసిన వ్యక్తుల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మొన్న రాధేశ్యాం , నిన్న ఆచార్య మరి ముందు రాబోతున్న సర్కారు వారి పాట పరిస్థితి ఏంటో అని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు