Mahesh -Trivikram: పారితోషికాలకే రూ.125 కోట్లా?

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో చిత్రమిది. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి.. ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభం కానుందని అధికారిక ప్రకటన వచ్చింది.’హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు నిర్మించనున్న ఈ చిత్రం 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుందని కూడా చిత్రబృందం వెల్లడించింది. మహేష్ బాబు నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. కాబట్టి.. బడ్జెట్ మరియు పారితోషికాల లెక్కలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.

కేవలం హీరో మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ .. పారితోషికాల రూపంలోనే నిర్మాతకి రూ.125 కోట్లు ఖర్చు అవుతుంది అని సమాచారం. మహేష్ బాబు ఈ మధ్య కాలంలో తన సినిమాలకి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే అమౌంట్ ను పారితోషికం కింద తీసుకుంటున్నాడు. అయితే ఈ చిత్రం విషయానికి వచ్చేసరికి పారితోషికాన్ని డైరెక్ట్ గానే తీసుకోవాలనుకుంటున్నట్టు వినికిడి.ఈ చిత్రం కోసం మహేష్ కు రూ.75 కోట్లు పారితోషికం అందుతుందని వినికిడి. అతని కెరీర్ లో హైయెస్ట్ పారితోషికం ఇదే అని తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ ఈ చిత్రం కోసం రూ.50 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక మొత్తంగా కలుపుకుని ఈ చిత్రానికి రూ.225 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు