Mahesh babu : రాముడు అంటే మహేషే !

గుణ శేఖర్ , శాకుంతలం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. “శాకుంతలం” సినిమా 14న రిలీజ్ అవుతుండడంతో సినిమాకి సంబంధించిన అన్నిపనులు ఆయనే చూసుకుంటూ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఆయన ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మహేష్ బాబు గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు.

గుణ శేఖర్ మహేష్ కాంబినేషన్ గురించిన కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ చేసిన సినిమాల్లో ఎక్కువ సినిమాల గుణ శేఖర్ తోనే చేసారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒక్కడు సినిమా సూపర్ హిట్ అవడంతో వీళ్ళ కాంబినేషన్ కి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. అయితే ఈ క్రేజ్ ని గుణ శేఖర్ కరెక్ట్ గా ఉపయోగించుకోలేక పోయాడు . ఒక్కడు హిట్ అయ్యాక గుణ శేఖర్ తో మహేష్ అర్జున్ , సైనికుడు సినిమాలు చేసారు కానీ ఒక్క సినిమా కూడా సరిగా ఆడలేదు సరి కదా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ తరువాత కూడా మహేష్ తో సినిమా చేయాలనీ గుణ శేఖర్ చాలా ప్రయత్నించినా మహేష్ కి ఉన్న కమిట్మెంట్స్ వాళ్ళ గుణ శేఖర్ తో సినిమా చేయడం కుదరలేదు.

శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గుణ శేఖర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ లో మహేష్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్న కి సమాధానం చెప్తూ.. మహేష్ చాలా రేర్ ఫీచర్స్ ఉండే వ్యక్తి , ఆయన ఎలాంటి పాత్రలోనైనా చాలా ఈజీ గా ఒదిగిపోతాడు.కాకపోతే ఆయనని ఒప్పించడం చాల కష్టం చాలా సిగ్గు మహేష్ కి .ఏ గెటప్ వేసుకోమన్న కూడా ఆయన ఇబ్బంది పడిపోతాడు. అందుకే ఆయన ఎక్కువగ గెటప్స్ లేని మాములు సినిమాలే ఆయన చేస్తారు. మన ఇండియన్ మైథాలజీ లాంటి కథలలో నైతే మహేష్ చాలా బాగా సెట్ అవుతాడు. రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ చేసిన గోన గన్న రెడ్డి పాత్ర ముందుగా మహేష్ కోసమే రాసుకున్న ,మన మైథాలజీ లో నైతే రాముడి పాత్రలో మహేష్ అద్భుతంగా సెట్ అవుతారు అని ఆయన అన్నారు.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు