WAR2 : వార్ కోసం భారీ సెట్.. సినిమాకే హైలెట్ అయ్యేలా ఆ సీక్వెన్స్!

WAR2 : బాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమా ఏదైనా ఉంది అంటే ‘వార్2’ అనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ ల కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రెండు ఇండస్ట్రీల నుండి భారీ అంచనాలు ఉండగా, ఇరు హీరోల అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కనీవినీ ఎరుగని స్థాయిలో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా మేకర్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటు ఎన్టీఆర్ సైతం ఈ సినిమాకు చాలా కష్టపడుతున్నాడు. ఓ వైపు దేవర షూటింగ్ లో బిజీగా ఉంటూనే, మరోవైపు వార్2 షూట్ లో పాల్గొంటున్నాడు. పైగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాని కూడా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అందుకే వార్2 (WAR2) సినిమాని వీలైనంత తొందర్లో ఫినిష్ చేయాలనీ ఆరాటపడుతున్నాడు. రీసెంట్ గా ముంబైలో కీలక సన్నివేశాలను షూట్ చేసిన చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Makers are building a huge set in Hyderabad for WAR2 action sequence

రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్…

ఇక రీసెంట్ గా దేవర షెడ్యూల్ ని ముగించిన ఎన్టీఆర్ నెక్స్ట్ వార్2 సెట్స్ లో మళ్ళీ అడుగు పెట్టనున్నాడు. ఇక వార్ మేకర్స్ ప్రస్తుతం ఈ ఓ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నారట. ఆగష్టు లో ఈ సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ ను ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ ల పై ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సీక్వెన్స్ లో హీరోలిద్దరితో పాటు సినిమాలో నటిస్తున్న కీలక తారాగణం కూడా పాల్గొంటున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో జాన్ అబ్రహం గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడట. హైదరాబాద్ లో జరగబోయే షెడ్యూల్ లో ఈ హీరో కూడా పాల్గొంటాడని సమాచారం.

- Advertisement -

సినిమాకి హైలెట్ అయ్యేలా ఈ సీన్!

ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ సీన్ అని టాక్. సినిమాకే హైలెట్ అయ్యేలా భారీ ఖర్చుతో స్టైలిష్ గా ఈ యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. దాదాపు ధూమ్ 2 తరహాలో ఓ ఛేజింగ్ సీన్ ఉంటుందట. ఇక టాలీవుడ్ లో అయితే ఎన్టీఆర్ పాత్రపైనే అభిమానుల ఫోకస్ ఉంటుందని చెప్పనక్కర్లేదు. హృతిక్ కే ధీటుగా ఉండే ఆ పాత్ర నెగిటివ్ టచ్ ఉన్న రోల్ అని ఇంకా వార్తలు వస్తున్నా మేకర్స్ కంఫర్మ్ చేయలేదు. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, అయాన్ ముఖర్జీ స్టైలిష్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు