Bharateeyudu2 : పెంచేదైనా… ముంచేదైనా? దానిపైనే ఆధారపడి ఉంది?

Bharateeyudu2 : లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండియన్2 సినిమా జులై 12న విడుదల అవుతుందన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకూ ఈ సినిమాపై సరైన బజ్ క్రియేట్ అవ్వలేదన్న మాట వాస్తవం. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా అందరూ “కల్కి2898ఏడి” సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ దాని తర్వాత కేవలం పదిహేను రోజుల్లో విడుదల కాబోతున్న భారతీయుడు2 సినిమా ఊసులు ఎక్కడా కనిపించడం లేదు. పైగా కమల్ హాసన్ కల్కి లోనూ ఉండగా, అందులో కమల్ పాత్ర గురించే స్వర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక కమల్ హాసన్ రెండు సినిమాల్లో ఉన్నారు కాబట్టి, కల్కి రిలీజయ్యాక తన ప్రమోషన్లను పెంచే ప్లాన్ లో ఉన్నారు దర్శకుడు శంకర్. ఈ నెలాఖరున హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ టెన్షన్ కు అసలు కారణం సరైన బజ్ లేకపోవడమే. ఈ సినిమాకు అదిరిపోయే కాంబినేషన్ తో పాటు భారీ తారాగణం టెక్నిషియన్స్ ఉన్నా, సినిమాపై పెద్దగా అంచనాలు క్రియేట్ అవ్వలేదు.

Makers are working hard for the trailer to increase the hype on Bharateeyudu2

ఒక్కరూ బజ్ పెంచడం లేదు?

ఇక భారతీయుడు2 (Bharateeyudu2 ) సినిమా నుండి ఇప్పటివరకూ ఒక టీజర్, ఓ రెండు పాటలు మాత్రమే విడుదల కాగా, అవి సినిమాపై హైప్ పెంచడానికి అంతగా ఉపయోగపడలేదు. పైగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ఆల్బమ్ కి ఏమాత్రం బాగుందన్న రెస్పాన్స్ రాకపోవడం బాగా ప్రతికూలంగా మారింది. విడుదల చేసిన సాంగ్స్ లో ఒక్క ‘వీరా సూరా’ సాంగ్ కాస్త బాగానే ఉన్నా, మిగతావేవీ మెప్పించలేదు. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్, ఎస్.జె. సూర్య, బాబీ సింహ ఇతర భారీ తారాగణం ఉన్నా, సినిమాపై అంచనాలు పెరగలేదు. ఇక ఈ సినిమాపై ఇప్పుడు ఇప్పుడు అంచనాలు పెంచే అవకాశం ఒక్క ట్రైలర్ కే ఉంది.

- Advertisement -

ట్రైలర్ పైనే అందరి ఆసక్తి ?

ఇక ఇండియన్ 2 సినిమాపై అంచనాలు పెంచే బాధ్యత ఒక్క ట్రైలర్ పైనే పడింది. ఇక రెండున్నర నిమిషాల వీడియోలో హైప్ పెంచే కంటెంట్ ఏముందో ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఇప్పటి తరం ప్రేక్షకులకు అంతగా ఎగ్జైట్ మెంట్ కలిగించలేకపోతోంది. జూలై 12 రిలీజ్ నాటికి ఈ పరిస్థితిలో అనూహ్యమైన మార్పు వస్తే తప్ప బజ్ రాదు. కమల్ విక్రమ్ తెలుగులోనూ బ్రహ్మాండంగా సక్సెసైన నేపథ్యంలో భారతీయుడు 2ని అంతకన్నా భారీగా థియేటర్లలో వదిలేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే కల్కి 2898AD కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కనీసం నాలుగు వారాల పాటు దాని ప్రభంజనం ఉంటుంది. అలాంటప్పుడు భారతీయుడు 2 ఓపెనింగ్స్ కి దెబ్బ పడుతుంది. తమిళనాడులో కాకపోయినా ఏపీ తెలంగాణలో దీని ఎఫెక్ట్ చాలా బలంగా ఉంటుంది. అందుకే లైకా సంస్థ ప్రస్తుతానికి జూలై 12ని హైలైట్ చేయకుండా పబ్లిసిటీ చేస్తోంది. ఇక కావాల్సింది హైప్ మాత్రమే. అది ట్రైలర్ తోనే సాధ్యమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రైలర్ ని ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత ప్లస్ అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమాపై అంచనాలు పెంచాలన్నా, ముంచాలన్నా ట్రైలర్ రెస్పాన్స్ పైనే ఆధారపడి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు