BUDDY : హైప్ ఎలాగూ లేదు.. ఆఫర్స్ కైనా అట్రాక్ట్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్?

BUDDY : అల్లు ఫ్యామిలీ నుండి ‘గౌరవం’గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లు శిరీష్. అల్లు ఫ్యామిలి నుండి వచ్చాడన్నమాటే గాని సక్సెస్ మాత్రం కెరీర్ లో లేకుండా పోయింది. అప్పుడెప్పుడో శ్రీరస్తు శుభమస్తు అంటూ ఓ యావరేజ్ సక్సెస్ సినిమాను ఖాతాలో వేసుకున్నాడు. దానికి కూడా అల్లు శిరీష్ కి పెద్దగా క్రెడిట్ ఏమి లేదు. నటుడిగా కూడా ఏమాత్రం సక్సెస్‌ కాలేకపోతున్నాడు శిరీష్ చివరగా ఊర్వశివో రాక్షసీవో అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన అల్లు శిరీష్ చాలా రోజుల తర్వాత ‘బడ్డీ’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించానికి వస్తున్నాడు. రెండేళ్ల గ్యాప్‌ తీసుకుని చేసిన ఈ బడ్డీ సినిమా రిలీజ్ కి వారం రోజులు కూడా టైం లేదు. కానీ బజ్ మాత్రం జీరో అని చెప్పాలి. అందుకే మేకర్స్ ఓ ప్లాన్ కి వచ్చారు.

Makers of BUDDY movie reduced ticket prices

రెండున్నరేళ్ళకు థియేటర్లో ఎంట్రీ…

ఇక అల్లు శిరీష్ నటించిన బడ్డీతో రెండున్నరేళ్ళకు థియేటర్లలో ఎంట్రీ ఇస్తున్నాడు ఈ అల్లు హీరో. ఇక ఇందులో శిరీష్‌ కి జోడీగా గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్‌ గా నటించగా, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ & లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కడం జరిగింది. ఇక `బడ్డీ` సినిమాకి హిప్ హాప్ తమీజా సంగీతాన్ని అందించారు. మొత్తంగా ఆగష్టు 2న థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవబోతుంది.

- Advertisement -

హైప్ లేదు.. ఆఫర్స్ కైనా అట్రాక్ట్ అవుతారేమో…

అయితే రిలీజ్ కి వారం రోజులే టైం ఉంది. కానీ సినిమాపై ఏమాత్రం హైప్ లేదు. రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. పైగా ఈ సినిమా తమిళ్ టెడ్డీకి కాపీ అని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి టికెట్ రేట్లు తగ్గించారని తెలుస్తుంది. సింగిల్ స్క్రీన్స్ లో 99 కే, అలాగే మల్టిప్లెక్స్ లో కేవలం 125 రూపాయలకే టికెట్ రేటుని అందుబాటులో ఉంచుతున్నట్టు సమాచారం. నిజానికి ఈ సినిమాపై ఏమాత్రం బజ్ లేకపోవడం వల్ల ఈ ఆఫర్ ని పెట్టినట్టు తెలుస్తుంది. మరి దేనికైనా థియేటర్లకు వస్తారో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు