Malaika Arora : మిస్టరీ మ్యాన్ తో మలైకా అరోరా… కొత్త లవరా?

బాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ మలైకా అరోరా, నటుడు అర్జున్ కపూర్ మధ్య బ్రేకప్ జరిగిందనే వార్తలు చాలా రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి. ఓ వైపు బ్రేకప్ గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు మలైకా ఓ మిస్టరీ మ్యాన్‌తో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. మలైకా ప్రస్తుతం స్పెయిన్‌లో టూరింగ్ మూడ్‌లో ఉంది. దీంతో మలైకా అక్కడికి ఎవరితో వెళ్లింది? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. మరి ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు ? అంటే..

మలైకా కొత్త లవరా?

బాలీవుడ్ ఐటం బాంబ్ మలైకా అరోరా సౌత్ ప్రేక్షకులకు కూడా సూపరిచితురాలే. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ డ్యాన్సర్‌గా, మోడల్‌గా, నటిగా, ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా, యోగా ఎక్స్‌పర్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్ అయిన మలైకాకు డ్యాన్స్ షోలలఓ కూడా జడ్జిగా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరవుతోంది. ఇక ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలలో ఐటెం సాంగ్స్‌లో మెరిసి మూవీ లవర్స్ ను ఓ ఊపు ఊపేసింది. అయితే మలైకా సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మలైకా అరోరా తన కంటే 12 సంవత్సరాలు చిన్న నటుడు అర్జున్ కపూర్‌తో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల నుంచి ఈ జంట విడిపోయింది అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలోనే మలైకా ప్రస్తుతం స్పెయిన్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఆ వెకేషన్ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అందరి కళ్ళు మలైకా కంటే ఆ ఫొటోల్లో ఉన్న మిస్టరీ మ్యాన్ పై పడ్డాయి. ఈ బ్యూటీ అతని ఫోటోను బ్లర్ చేసి నెట్టింట వదిలింది. దీంతో అందరూ అసలు మలైకా ఎవరితో వెకేషన్ కు వెళ్ళింది? అనే డౌట్ మొదలైంది. అర్జున్‌తో విడిపోయిన తరువాత మలైకా ఇప్పుడు ఎవరితో డేటింగ్ చేస్తోంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

అర్జున్ తో బ్రేకప్ నిజమేనా?

మలైకా అరోరా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని వెకేషన్ ఫోటోలను షేర్ చేయగా, అందులో ముఖం కన్పించకుండా ఉన్న వ్యక్తి ఫోటో అర్జున్‌తో ఆమె బ్రేకప్ చర్చకు దారి తీసింది. ఆ మిస్టరీ మ్యాన్ ను చూశాక బ్రేకప్ వార్తలు నిజమేనా అంటున్నారు. ఆమె జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాడా? అర్జున్‌తో విడిపోవడానికి కారణం ఏంటి అంటూ ఆమె కామెంట్ బాక్స్ ను ప్రశ్నలతో నింపేస్తున్నారు. కాగా మలైకా, అర్జున్ తో విడిపోవడంపై ఇప్పటిదాకా స్పందించలేదు.

అర్జున్ తో విడిపోవడానికి కారణం ఇదేనా?

రీసెంట్ గా జరిగిన అర్జున్ కపూర్ బర్త్ డే వేడుకల్లో మలైకా కన్పించడాపోవడంతో ఈ లవ్ బర్డ్స్ విడిపోయారని ప్రచారం జరుగుతోంది . అంతేకాదు అర్జున్ కపూర్ పెళ్లి చేసుకుని బిడ్డను కనాలని కలలు కాంతున్నాడని, మలైకాకు ఇప్పటికే 22 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఈ వయసులో ఆమెకు బిడ్డ పుడితే పెద్ద వార్త అవుతుందనే భయంతో విడిపోయారని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు