Malavika Jayaram Marriage : ఘనంగా జయరామ్ కుమార్తె వివాహం… పిక్స్ వైరల్

Malavika Jayaram Marriage : స్టార్ జంట జయరామ్, పార్వతి కుమార్తె, మోడల్ మాళవిక వివాహం నవనీత్ గిరీష్‌ తో ఘనంగా జరిగింది. మే 3న శుక్రవారం ఉదయం 6:30 గంటలకు గురువాయూర్ ఆలయంలో ఈ జంట ఇరువురి పెద్దల ఆశీర్వాదంతో సాంప్రదాయ హిందూ వివాహంలో వివాహం చేసుకున్నారు. వరుడు నవనీత్ గిరీష్ పాలక్కాడ్‌కు చెందినవాడు. మాళవిక పెళ్ళిలో అయ్యంగార్ స్టైల్‌లో ఎర్రటి పట్టు చీరను ధరించింది. వరుడు కేరళ సంప్రదాయ కసావు ధోతి, శాలువా ధరించాడు. తాజాగా పెళ్ళయిన ఈ జంటకు అభిమానుల సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త జంట పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివాహ వేడుకకు హాజరైన సెబ్రిటీలు వీళ్ళే..

ఈ వివాహ వేడుకకు సెలబ్రిటీ కపుల్ జయరామ్, నటి పార్వతి కుటుంబ సభ్యులు. మాళవిక సోదరుడు, నటుడు కాళిదాస్ జయరామ్ కూడా హాజరయ్యారు. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య జరిగిన మాళవిక వివాహ వేడుకకు సినిమా ఇండస్ట్రి నుంచి సెలబ్రిటీలు సురేష్ గోపి, ఆయన భార్య రాధిక, అపర్ణ బాలమురళి హాజరయ్యారు.

జయరామ్ దంపతులు ఎమోషనల్

సెలబ్రిటీ కపుల్ జయరామ్, నటి పార్వతి తమ కూతురు పెళ్ళిలో ఎమోషనల్ అయ్యారు. 32 ఏళ్ల క్రితం గురువాయూర్‌ ఆలయంలో తమ పెళ్లి జరగ్గా, మళ్ళీ ఇన్నేళ్లకు తమ కూతురి పెళ్లి కూడా అక్కడే జరగడం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

రిసెప్షన్ కు అతిథిగా ముఖ్యమంత్రి

నేడు త్రిసూర్‌లో జరిగే వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి పినరయి వజయన్‌ తదితరులు హాజరుకానున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రి నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరై ఈ నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.

డిసెంబర్ లోనే నిశ్చితార్థం..

ఈ జంట నిశ్చితార్థం డిసెంబర్‌లో కర్ణాటకలోని కూర్గ్ జిల్లా మడికేరిలో జరిగింది. అయితే చెన్నైలో వరదల కారణంగా అప్పుడు ఎంగేజ్మెంట్ కు చాలా మంది హాజరు కాలేకపోయారు. మాళవిక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. తనకు కాబోయే భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ఓ స్పెషల్ పోస్ట్‌ ద్వారా అతనిని తన అభిమానులకు పరిచయం చేసింది. జయరామ్ తర్వాత అధికారికంగా నవనీత్ గిరీష్, మాళవిక నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోను షేర్ చేసి అధికారికంగా తన కూతురు ఎంగేజ్మెంట్ ను అనౌన్స్ చేశారు.

మాళవిక మోడల్ కూడా..

మాళవిక స్టెల్లా మారిస్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. అలాగే వేల్స్‌లో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. మాళవిక ఇంకా సినిమాల్లోకి రాలేదు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. ఆ తరువాత తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

మాళవిక భర్త ఏం చేస్తాడంటే ?

మాళవిక భర్త నవనీత్ పాలక్కాడ్‌లోని నెన్మారాలోని కీజెప్పట్ కుటుంబానికి చెందిన గిరీష్ మీనన్, మాజీ యూఎన్ అధికారి వత్సల కుమారుడు. యుకెలో చార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు.

త్వరలో కాళిదాస్ జయరామ్ వివాహం

మాళవిక సోదరుడు, నటుడు కాళిదాస్ కూడా గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో తనకు కాబోయే భార్య, మోడల్ అయిన తారిణి కళింగరాయర్‌తో ఆయన వివాహం జరగనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు