Malavika Mohanan: తంగలాన్ ప్రమోషన్ లో ఎదురుదెబ్బ.. కట్ చేస్తే..!

Malavika Mohanan.. ప్రముఖ కోలీవుడ్ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో తమిళ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ, ఈ మధ్యకాలంలో నేరుగా తెలుగు చిత్రాలలో కూడా అవకాశాలు అందుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా ఈమె రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Malavika Mohanan: Backlash in the promotion of Tangalan.. if cut..!
Malavika Mohanan: Backlash in the promotion of Tangalan.. if cut..!

తంగలాన్ ప్రమోషన్స్ లో మాళవిక..

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ హీరోగా, పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తోంది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ , నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై సినిమాని నిర్మిస్తున్నారు. ఇకపోతే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది చిత్ర బృందం.అందులో భాగంగానే మాళవిక మోహనన్ అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమెకు ఊహించని ఘటన ఎదురైందని తెలుస్తోంది.

నెటిజన్ అలాంటి కామెంట్..

చిట్ చాట్ సెషన్ లో భాగంగా.. ఒక నెటిజెన్ మాళవికకు తమిళ్ ఆడియన్స్ అంటేనే ఇష్టం, ఈమె తెలుగు ఆడియన్స్ ను పట్టించుకోదు. అయినా సరే నేను ఈమె నటించిన తంగలాన్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్ చేశారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఒక నెటిజన్ నుండి ఇలాంటి ఒక ప్రశ్న ఎదురవడంతో ఆమె ఖంగుతుంది అయినా సరే వెంటనే రియాక్ట్ అయ్యింది కూడా..

- Advertisement -

సున్నితంగా రిప్లై ఇచ్చిన మాళవిక..

మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. ఇదంతా నిజం కాదు. నాకు తెలుగు ఆడియన్స్ అంటే కూడా ప్రేమ ఎక్కువ. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ నన్ను చాలా ప్రేమగా ఆదరిస్తారు .అందుకే నేను ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయడం ప్రారంభించాను అంటూ తెలిపింది మాళవిక మోహనన్. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన మాళవిక పై ఇలాంటి కామెంట్ చేయడంతో ఆమె మాత్రం తనదైన స్టైల్ లో అదిరిపోయే సమాధానం తెలిపిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

మాళవిక కెరియర్..

మాళవిక మోహనన్ కెరియర్ విషయానికొస్తే.. 1993 ఆగస్టు 4 జన్మించిన ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా పనిచేసింది. ఆ తర్వాత మలయాళంలో 2013లో వచ్చిన పట్టం పోల్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అలా తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో నటించింది మాళవిక. చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020 లో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు తమిళ్ లో నటించిన చిత్రాలు రీమేక్ అయి ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఇప్పుడు నేరుగా ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు