Malavika Mohanan: టాలీవుడ్‌ హీరోపై హాట్‌ కామెంట్స్‌..చాలా బాగుంటాడంటూ !

Malavika Mohanan: సౌత్‌ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా కొంతమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయిపోయిన వారు ఎందరో ఉన్నారు. మరికొందరేమో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ మాళవిక మోహనన్ ఒకరు. ఈ బ్యూటీ సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.

మాళవిక నటించింది కొన్ని సినిమాల్లోనే అయినప్పటికీ గ్లామరస్ బ్యూటీగా, మంచి నటిగా ప్రేక్షకుల్లో విపరీతమైన పేరును తెచ్చుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. దుల్కర్ సల్మాన్ నటించిన “పట్టం పోలే” అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మాళవిక ఆ తర్వాత తమిళంలో రజనీకాంత్ తో “పేట”, విజయ్ తో “మాస్టర్”, ధనుష్ తో “మారన్” వంటి సినిమాల్లో నటించింది. హిందీలో కూడా ఓ సినిమా చేసింది.

- Advertisement -

కానీ తెలుగులో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. ప్రభాస్ “రాజాసాబ్” తో తెలుగులో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది. ఈ తరుణంలోనే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఈ బ్యూటీ మాట్లాడింది. “నేను సౌత్ లో అన్ని భాషల్లో సినిమాలు చేశాను. తెలుగులో తప్ప. మంచి పాత్ర దొరికితే తెలుగులో కూడా చేయాలని కోరిక నాకు చాలా ఉంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ఎంతో ఆశగా ఎదురు చూసా. ప్రభాస్ తో సినిమా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ సెట్ లో చాలా చాలా బాగుంటాడు” అంటూ కామెంట్స్ చేసింది. ఈ బ్యూటీ ప్రభాస్ గురించి కామెంట్స్ చేయడంతో ప్రభాస్ అభిమానులంతా తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు