Malavika Mohanan: మాళవిక మొదటిసారి ముఖం చూపించింది

Malavika: మాళవిక మోహనన్ ఈమె గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పట్టం పోలే అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక. ఇకపోతే ప్రస్తుతం ఆడియన్స్ కి భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూడటం అలవాటు అయిపోయింది కాబట్టి గొప్ప నటీనటులు సినిమాలు ఏ భాషలో ఉన్నా కూడా అందరూ చూడటం మొదలుపెట్టారు. అలానే లోకేష్ కనకరాజు ఖైదీ సినిమా కూడా చూశారు. ఆ సినిమా చూసిన తర్వాత లోకేష్ నెక్స్ట్ సినిమా పైన అందరికీ అంచనాలు మొదలయ్యాయి. అప్పుడు లోకేష్ చేసిన సినిమా మాస్టర్. ఆ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది మాళవిక.

Malavika Mohanan

అక్కడితో చాలామంది ప్రేక్షకులు మాళవికకు కనెక్ట్ అయిపోయారు. మాస్టర్ సినిమాలో చారులత అనే పాత్రలో కనిపించింది. అయితే ఆ సినిమా తర్వాత మారన్ అనే తమిళ్ సినిమా కూడా చేసింది. ఇకపోతే మలయాళం లో క్రిస్టి సినిమాలో కనిపించింది మాళవిక. కేవలం మలయాళం ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూశారు. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా సోనీ లీవ్ లో తెలుగులో చూసి మాళవికకు ఫ్యాన్ అయిపోయిన అభిమానులు కూడా ఉన్నారు. క్రిష్టి సినిమాలో చాలా అందంగా కనిపిస్తుంది మాళవిక.

- Advertisement -

Malavika Mohanan

అయితే సోషల్ మీడియాలో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ మాళవిక ఎప్పుడు హాట్ ఫొటోస్ ను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. మాళవిక అందాలకు చాలామంది ఫిదా అయిపోయారు. ఇక రీసెంట్ గా తంగాలన్ అనే సినిమాను చేస్తుంది మాళవిక. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో కొన్ని ఇంటర్వ్యూ కూడా ఇస్తుంది మాళవిక. అయితే కొద్దిసేపటి క్రితమే మాళవిక ఒక ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. పొద్దున్నే 6 గంటలకు లేచాను దానికి తోడు ఫ్లైట్ 4 గంటలు లేటు అంటూ ఒక సెల్ఫీ దిగి అప్లోడ్ చేసింది. ఆ ఫోటో కింద చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు హాట్ ఫొటోస్ లో చూసి మాళవిక మొదటిసారి తన ముఖం చూపించింది అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు