Malayala Heros : హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న మలయాళ హీరో ఎవరో తెలుసా? ఫహద్, పృథ్వీరాజ్ మాత్రం కాదండోయ్

Malayala Heros : ఇప్పుడు మలయాళం సినిమాలు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఫేవరెట్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ లో మలయాళ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా మాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడు అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరి ఇటీవల కాలంలో ఇంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న మాలీవుడ్ హీరోల్లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఈ హీరోకే..

మలయాళ పరిశ్రమలో మోహన్‌లాల్‌, మమ్ముట్టి లాంటి సూపర్‌ స్టార్లు చాలా మంది ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫహద్ ఫాజిల్, టోవినో థామస్ కూడా బాగానే ప్రేక్షకులను అలరించారు. సాధారణంగా టాలీవుడ్ లో అయితే యంగ్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో ఎదుగుతూ వందల కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నారు. అయితే మలయాళ సినీ పరిశ్రమలో మాత్రం ఇంకా సీనియర్ హీరోలదే హవా నడుస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మాలీవుడ్ హీరోల్లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరో మోహన్ లాల్. దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయనకు సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ లో కూడా మోహన్ లాల్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కేవలం అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడు మాత్రమే కాదు భారతదేశంలోని అత్యంత ధనవంతుల్లో మోహన్ లాల్ ఒకరు.

కంప్లీట్ స్టార్ @360..ఇదో చ‌రిత్ర‌! | Actor Mohan Lal Film Journey in Film Industry

- Advertisement -

మోహన్ లాల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

మోహన్‌ లాల్ తన పాత్రను బట్టి ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల నుంచి రూ.17 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ కోసం మోహన్ లాల్ కు ఆ మూవీ నిర్మాతలు రూ.8 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ మొత్తం ఆస్తుల విలువ రూ.376 కోట్లు. 40 సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమలో భాగమైన ఆయన ఇప్పటిదాకా 400 చిత్రాలకు పైగా నటించారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలోని లెజెండరీ నటుల్లో మోహన్ లాల్ కూడా ఒకరు.

మోహన్‌లాల్, తమిళ నిర్మాత కె.బాలాజీ కూతురు సుచిత్రను 1988 ఏప్రిల్ 28న వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు ప్రణవ్ మోహన్ లాల్, విస్మయ మోహన్ లాల్. ఆయన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ లో కీలక పాత్రను పోషించి, తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు.

2024లో మలయాళ సినిమాల హవా

ఈ ఏడాది మలయాళ సినిమాకు గోల్డెన్ టైమ్ నడుస్తోంది. 2024లో రిలీజ్ అయిన పలు మలయాళ సినిమాలు కలెక్షన్స్ పరంగా దుమ్మురేపాయి. అందులో ఆవేశం, ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్ వంటి సినిమాలు ఉన్నాయి. కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉండడంతో మలయాళ సినిమాలకు రోజురోజుకూ అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు