Nirmal Benny Passes Away : ప్రముఖ మలయాళ హాస్య నటుడు నిర్మల్ బెన్నీ ఆకస్మిక మరణం..

Nirmal Benny Passes Away : మలయాళ ఇండస్ట్రీ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ ఈరోజు (ఆగష్టు 23) ఉదయం ఆకస్మికంగా మరణించడం జరిగింది. ఈ విషయాన్ని మలయాళ సినీ నిర్మాత నిర్మల్ బెన్నీ స్నేహితుడు సంజయ్ పడియూర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మలయాళ ఇండస్ట్రీ లో మంచి హాస్య నటుడిగా పేరు పొందిన నిర్మల్ బెన్నీ ఆకస్మికంగా మరణించడం ఇండస్ట్రీలో షాకింగ్ గా మారింది. ఇక నిర్మల్ బెన్నీ గురించి నిర్మాత సంజయ్ చేసిన పోస్ట్‌లో ఇలా ఉంది.. “గొప్ప హృదయం కలిగిన ప్రియమైన స్నేహితుడికి కన్నీటి వీడ్కోలు.. నీ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, అని చెప్పుకొచ్చాడు. ఇక నిర్మల్ బెన్నీ మరణ వార్తపై కారణాలు ఇలా ఉన్నాయి.

Malayalam Actor Nirmal Benny Passes Away

గుండెపోటుతో మరణించిన నిర్మల్ బెన్నీ..

నిర్మల్ బెన్నీ (Nirmal Benny Passes Away) మరణవార్తతో మలయాళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురయింది. మలయాళంలో హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఇతని, నిర్మల్ బెన్నీ తిరువనంతపురంలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. అతనికి వయసు 37 సంవత్సరాలు. మలయాళంలో యూట్యూబ్ వీడియోలతో నిర్మల్ బెన్నీ తన లైఫ్ స్టార్ట్ చేయగా, సినిమాల్లో హాస్యనటుడిగా కెరీర్ ని ప్రారంభించాడు. 2012లో ‘నవగతర్కు స్వాగతం’ తో సినీ రంగ ప్రవేశం చేశాడు.

- Advertisement -

హాస్య నటుడిగా మంచిపేరు..

ఇక నిర్మల్ బెన్నీ హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన బెన్నీ తన కెరీర్‌లో ఐదు చిత్రాలలో కనిపించాడు. వాటిలో’ఆమెన్’ మరియు ‘దూరం’, సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసాడు. ఇక నిర్మల్ బెన్నీ మరణం పట్ల మలయాళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు