Malayalam Actress : 2017లో నటిపై అత్యా*చారం – విచారణలో సంచలన నిజాలు… జస్టిస్ హేమ కమిటీ నివేదిక నేడే..!

Malayalam Actress.. 2017లో హీరోయిన్ భావన పై జరిగిన లైంగిక దాడి కేసులో.. జస్టిస్ హేమ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయగా.. తాజాగా కమిటీ సమర్పించిన నివేదిక నేడు విడుదల కానుంది. ముఖ్యంగా మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులు , లింగ అసమానత గురించి కమిటీ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు 223 పేజీలతో కూడిన భాగాన్ని అందజేయనున్నట్లు సమాచారం. మలయాళం ఇండస్ట్రీలో గోప్యతను ప్రభావితం చేయడంలో అలాగే వారిని గుర్తించడంలో సహాయపడే రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఆదేశం మేరకు ఈ నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.. అంతేకాదు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ ఏ ఏ హకీమ్, దరఖాస్తుదారులకు ఏ ఏ భాగాలు ఇవ్వాలో, ఏది మినహాయించబడుతుందో తెలుపుతూ నోటీసు ఇవ్వాలని కూడా ఆదేశించారు.. దీని ప్రకారమే 223 పేజీల నివేదిక నుండీ 82 పేజీల 115 పేరాలు తొలగించబడినట్లు తెలుస్తోంది.

Malayalam Actress : Rape on actress in 2017 - Sensational truths in investigation... Justice Hema committee report today..!
Malayalam Actress : Rape on actress in 2017 – Sensational truths in investigation… Justice Hema committee report today..!

2017లో ప్రముఖ హీరోయిన్ పై లైంగిక దాడి..

అసలు విషయంలోకి వెళ్తే.. 2017లో ప్రముఖ హీరోయిన్ భావన మీనన్ పై మలయాళ స్టార్ హీరో దిలీప్ అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. దీంతో మలయాళం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, ఆ బాధిత సెలబ్రిటీలందరూ కూడా ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి తెలియజేశారు.

యువ నటిపై దాడి..WCC ఏర్పాటు..

అంతేకాదు యువ నటిపై దాడి జరగడంతో న్యాయం మరియు న్యాయ పోరాటంలో ఆమె తో కలిసి పని చేయడం తమ కర్తవ్యం అని సినీ పరిశ్రమ నుంచీ కొంతమంది వర్గం మహిళా కార్యకర్తలు ముందుకు వచ్చి విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC ) గా ఏర్పడ్డారు.. ఇందులో మహిళా నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు.

- Advertisement -

జస్టిస్ కే హేమ అధ్యక్షతన కమిటీ..

దీంతో 2017 జూలై లో జస్టిస్ కే.హేమ అధ్యక్షతన కమిటీ పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జస్టిస్ హేమ (రిటైర్డ్) , మాజీ బ్యూరోక్రాట్ కేబి వత్సల కుమారి మరియు ప్రముఖ నటి శారద సభ్యులుగా వున్నారు.చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న అన్యాయాలను , హింసను పరిశీలించి పరిష్కారాలను సూచించడమే లక్ష్యంగా ఈ కమిటీ పెట్టుకుంది. చలనచిత్ర పరిశ్రమ అంతర్గత పని తీరున పరిశీలించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం భారత దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

కమిటీ నివేదికను విడుదల చేయాలని ఉత్తర్వులు..

ఇక జూలై 25 లోగా నివేదిక అందజేయాలని రాష్ట్ర సమాచార కమిషనర్ డాక్టర్ ఏ ఏ అబ్దుల్ హకీమ్ ఆదేశించగా, ఆర్టిఐ చట్టం కింద నిషేదించబడినవి తప్ప ఎలాంటి సమాచారాన్ని కూడా దాచకూడదని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక నివేదికను చదివిన తర్వాత హేమా కమిటీ నివేదికను బయటపెట్టాలని కూడా సమాచార హక్కు కమిషన్ ఆదేశించింది. ముఖ్యంగా కమిటీ నివేదికను విడుదల చేసేటప్పుడు అందులో తెలిపిన వ్యక్తుల గోప్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేసింది 49వ పేజీలోని పేరా 96, పేజీలు 81 నుంచి 100, భాగాలు 165 నుంచి 196 వరకు నివేదిక అనుబంధాన్ని విడుదల చేయరాదని ఉత్తర్వులలో ప్రత్యేకంగా స్పష్టం చేసింది. మరి ఈరోజు సాయంత్రం కమిటీ నివేదికను సమర్పించనుంది. మరి ఈ తీర్పు భావనకు ఏ విధంగా అనుకూలంగా వస్తుంది ఎవరెవరికి శిక్ష పడుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు