Mallika Sherawat: క్యాస్టింగ్ కౌచ్ వల్ల కెరియర్ నే కోల్పోయిన ప్రముఖ నటి..!

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటికప్పుడు చాలామంది సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే గతంలో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ పెద్దగా బయటకు వచ్చేది కాదు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న విషయం కూడా బయటకి వస్తూ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో అవకాశాల కోసం తాముపడ్డ కష్టాల గురించి అలాగే పైకి ఎదుగుతున్న క్రమంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఇలాంటి సమయంలోనే క్యాస్టింగ్ కౌచ్ సమస్య సెలబ్రిటీల కెరియర్ కి అడ్డుగా మారుతోంది.

ఇకపోతే ఇప్పటికే చాలామంది టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ హీరోయిన్ల వరకు సినీ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ గురించి నోరు విప్పారు.. ఇప్పుడు తాజాగా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ కూడా తన సినిమా కెరియర్ నాశనం అవ్వడానికి కారణం ఈ క్యాస్టింగ్ కౌచ్ అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించింది. ఇక ఈమె విషయానికి వస్తే.. బాలీవుడ్ సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ చిత్రాలు కూడా చేసింది. 1997లో ఎయిర్ హోస్టెస్ గా పని చేసిన మల్లికా.. ఢిల్లీకి చెందిన పైలెట్ కరణ్ సింగ్ గిల్ ను వివాహం చేసుకుంది.

అయితే సినిమాలలో అవకాశం రావడంతో భర్తకు విడాకులు ఇచ్చి 2003లో ఖ్వాహిష్, 2004లో మర్డర్ సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక అదే సమయంలో క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తన కెరియర్ ముగిసింది అంటూ చెప్పుకొచ్చింది. ఒక సినిమా హీరోతో కాంప్రమైజ్ అవ్వనందుకు తనకు సినిమా అవకాశాలు రాకుండా చేశారని తెలిపింది.. ఒక సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఆ సినిమా హీరో అర్ధరాత్రి మూడు గంటలకు ఫోన్ చేసి నా ఇంటికి రా అని పిలిచాడు.. అయితే నేను వెళ్ళలేదు.. అందుకే నాకు సినిమా అవకాశాలు రాకుండా చేశాడు అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇక మర్డర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈమె ఈ సినిమా తర్వాత చాలా చిత్రాలలో అవకాశాలు వచ్చాయి.. కానీ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రాలేదు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో కొద్దిరోజులు కనిపించిన మల్లికా ఆ హీరో చేసిన పని కారణంగా సినిమాలను పూర్తిగా తగ్గించేసింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు