Mamitha Baiju : ‘ప్రేమలు’ బ్యూటీ చేసిన యాడ్ చూశారా?

Mamitha Baiju : ఈ ఏడాది మలయాళంలో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. అందులో ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడం మాత్రమే భారీ కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఆ సినిమా లో హీరోయిన్ గా మమిత బైజు సినిమా హీరోయిన్ గా చేసింది.. ఆ సినిమా తో బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. అయితే ఈ అమ్మడు సినిమాలు మాత్రమే కాదు ఒక యాడ్ కూడా చేసింది.. ఆ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

మలయాళం సినిమాలతో పాటు పలు భాషల్లో సినిమాలను చేసింది.. ప్రేమలు సినిమాలో మమిత బైజు క్యూట్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. యూత్ అంతా ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. మళయాళంతో పాటు తెలుగు, తమిళ్ లో కూడా మమిత బైజు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ప్రస్తుతం మమిత బైజు ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. వేరే భాషల్లో కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు తెచ్చుకుంటుంది…

Mamita Baiju's add video went viral in social media
Mamita Baiju’s add video went viral in social media

అయితే ఈ అమ్మడు సినిమాలు మాత్రమే కాదు.. ప్రేమలు సినిమా వల్ల పలు యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది.. ఈ అమ్మడు ఈ మధ్య ఓ యాడ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ వార్త విన్న ఫ్యాన్స్ ఆ  యాడ్ ఏంటో అని తెగ వెతికేస్తున్నారు.. ఇంతకీ ఆమె చేసిన యాడ్ ఏంటంటే.. ఇటీవల మంచ్ చాక్లెట్ కి మమిత బైజు యాడ్ చేసింది. ఈ యాడ్ వచ్చి రెండు వారాలు అవుతున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో మమిత బైజు దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ మలయాళ కుట్టి ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు