Maname Movie: మనమే మూవీ OTT రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే !

Maname Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో అచ్చం మన పక్కింటి కుర్రాడిలాగా అనిపిస్తూ ఉంటాడు. మనలో ఒకడు…. మన వ్యక్తి అనే ఫీలింగ్ వచ్చేలా చేస్తాడు. ఈ హీరో సినిమాల పరంగా ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ హీరో హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. శర్వానంద్ కి సరైన సాలిడ్ హిట్ ఒక్కటి కూడా రావడం లేదు.

ఈ క్రమంలోనే శర్వానంద్…. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టితో కలిసి “మనమే” అనే చిత్రంలో నటించారు. ఇక ఈ బ్యూటీకి కూడా సినిమాల పరంగా అసలు కలిసి రావడం లేదు. చాలా కాలమే అవుతుంది ఈ బ్యూటీకి హిట్ పడి. ఇక వీరిద్దరూ కలిసి మనమే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా జూన్ 7వ తేదీన థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో హిట్ కొట్టలేదు. కానీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటించగా…. ఆయేషా ఖాన్ కీలకపాత్రలో నటించింది.

అలాగే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. అదేంటంటే…. ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నట్టుగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా జూలై 12 నుంచి టీవిలోకి రాబోతుందని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

Manamey movie break even done in 15 days

అయితే ఈ సినిమాని హాట్ స్టార్ సంస్థనే ఎందుకు కొనుగోలు చేసింది అనే వార్త వైరల్ అవుతుంది. అయితే దానికి గల కారణం ఓటీటీలో డీల్ ఓకే కానీ సినిమాలన్నీ హాట్ స్టార్ సంస్థ వారే కొనుగోలు చేసుకుంటారు. ఇక ఈ సినిమాని హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే సినిమా వస్తే కానీ తెలియదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు