Maname Movie : మనమే మూవీ టీంతో శర్వానంద్ గొడవ… అసలేమైంది అంటే..?

Maname Movie.. వివాదాలకు తావు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోయే అతి కొద్ది మంది యంగ్ హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు.. తన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం మనమే.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్ , ఆయేషా ఖాన్ , వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ , సుదర్శన్, శివ కందుకూరి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా జూన్ 7వ తేదీన థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు..

ఆకట్టుకుంటున్న మనమే ట్రైలర్..

ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇందులో హీరో, హీరోయిన్ల మధ్య డైలాగ్స్ , శర్వానంద్ కామెడీ టైమింగ్, హేషం అబ్దుల్ వహబ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా ఆకట్టుకుంటున్నాయి.. కథను రివీల్ చేయకుండా ట్రైలర్ ను కట్ చేశారు. శర్వానంద్, కృతి శెట్టి కలిసి ఒక బాబుని పెంచుతున్నట్లు ట్రైలర్లో కనిపిస్తుంది. అయితే ఆ బాబు ఎవరు అనేది తెలియకుండా ట్రైలర్ ని చూపించడం గమనార్హం.చివర్లో..” ఎంత ప్రేమ పెంచుకున్న దగ్గరవుతాం కానీ సొంతం అవలేము కదా” అంటూ కృతి శెట్టి చెప్పే డైలాగ్ మనసుకు హత్తుకుంటుంది. అలాగే తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ కూడా ఈ ట్రైలర్ లో మనం వినవచ్చు.. మొత్తానికైతే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోనున్నట్లు సమాచారం..

చిత్ర బృందంతో గొడవలపై శర్వానంద్ క్లారిటీ..

Maname Movie: Sharwanand's fight with the Maname movie team... is it real?
Maname Movie: Sharwanand’s fight with the Maname movie team… is it real?

ఇదిలా ఉండగా మరొకవైపు చిత్ర బృందంతో శర్వానంద్ కి గొడవలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాలపై శర్వానంద్ స్పందిస్తూ తనకు చిత్ర బృందానికి మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏమిటి? అసలు ఎందుకు ఆ విభేదాలు వచ్చాయి? అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు.. చివరిగా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈయన .. బిగ్ స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండు సంవత్సరాలవుతోంది. ఈ నేపథ్యంలోనే విభేదాలపై క్లారిటీ ఇస్తూ శర్వానంద్ మాట్లాడుతూ… బిగ్ స్క్రీన్ పై కనిపించి.. దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది.. ఇక నుంచి నేను చేసే ప్రతి సినిమా కోసం చాలా కష్టపడతాను.. సినిమా ఫెయిల్ అయినా.. సక్సెస్ అయినా ఆ బాధ్యత నేనే తీసుకుంటాను.. ఈ సినిమా బాగా రావాలని చిత్ర బృందంతో చాలా గొడవ పెట్టుకున్నాను.. సినిమా హ్యాపీగా ఏ రోజూ చేయలేదు.. ప్రతిరోజు గొడవలు పెట్టుకుంటూ .. ఎంతో కష్టపడుతూ సినిమా చేశాము.. ఇప్పుడు కూడా చిత్ర బృందంతో గొడవలు ఉన్నాయి.. అయితే ఈ గొడవలన్నీ కూడా సినిమా బాగా రావడం కోసమే తప్పా.. మరే ఇతర సమస్యల గురించి గొడవలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు శర్వానంద్.. మరి ఇన్ని గొడవలు , కష్టాల మధ్య తెరకెక్కించిన ఈ సినిమా శర్వానంద్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు