Manamey : మనమే ఏరియా వైస్ బిజినెస్& బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..

Manamey : టాలీవుడ్ లో గత వారం మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అందుకున్నంత టాక్ తెచ్చుకోకపోగా, ఉన్నంత లో కార్తికేయ భజేవాయువేగం పర్వాలేదనిపించింది. ఇక ఈ వారం మరో నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతుండగా, అందులో శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమా కూడా ఒకటి. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వా ప్రసాద్ నిర్మించడం జరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ తర్వాత రెండేళ్ళ క్రితం ఒకే ఒక జీవితం సినిమా తో డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్న శర్వానంద్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ అయిన “మనమే” (Manamey) మూవీ తో ఈ వీకెండ్ లో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద డీసెంట్ అనిపించే రేంజ్ లో అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా గ్రాండ్ గా ఇప్పుడు రేపు థియేటర్లలో జూన్ 7న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.

Manamey Movie Business & breakeven Target

డీసెంట్ బిజినెస్ చేసిన మనమే..

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 450-480 రేంజ్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న మనమే మూవీ వరల్డ్ వైడ్ గా 650 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా జానర్ కి ఇవి సాలిడ్ రిలీజ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఆల్ రెడీ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి బిజినెస్ ను సొంతం చేసుకోగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఓన్ గా కొన్ని చోట్ల అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ లెక్కలను ఒకసారి గమనిస్తే.. నైజాంలో 3.5 కోట్లు, సీడెడ్ లో 1.5 కోట్లు, ఆంధ్ర 5 కోట్లు జరగగా, తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 1.50 కోట్లు బిజినెస్ చేయగా, మొత్తంగా వరల్డ్ వైడ్ గా 11.50 కోట్ల డీసెంట్ బిజినెస్ చేసిందని చెప్పాలి.

- Advertisement -

భారీ ఓపెనింగ్స్ టార్గెట్..

ఇక మనమే సినిమా మొత్తం మీద సినిమా 11.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా, బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే, అటూ ఇటూగా 12 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమాకి ఆడియన్స్ నుండి మంచి టాక్ కనుక సొంతం అయితే ఈ బిజినెస్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాలలో మేకర్స్ మాత్రం భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండగా, సమ్మర్ ఎండలు, ఐపీఎల్ హడావిడి, ముఖ్యంగా ఎన్నికల హడావిడి కూడా అయిపోయినందువల్ల, సినీ జనాలు బాగా ఆకలితో ఉంటారు. పైగా రెండు నెలలుగా నిఖార్సైన హిట్ సినిమా కూడా లేదు. అందువల్ల మనమే సినిమాకి మంచి టాక్ వస్తే సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉంది. ఇక మనమే సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించడం జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు