Manamey Movie First Review : మనమే సినిమా ఫస్ట్ రివ్యూ

Manamey Movie first review: ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చూసి భలే మంచి రోజు అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీరామ్. అయితే శ్రీరామ్ ఆదిత్య కెరియర్లో చేసినవి తక్కువ సినిమాలు అయినా కూడా మంచి సక్సెస్ రేట్ ఉందని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద శ్రీరామ్ ఆదిత్య తీసిన సినిమాలు డిజాస్టర్లు అయితే కాలేదు. మినిమం గ్యారంటీ ఉంటుంది అని నిరూపించుకున్నాడు. చివరగా నాగార్జున నానితో దేవదాస్ అనే సినిమాను చేశాడు. సినిమా ఊహించిన విజయాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం మనమే అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

శర్వానంద్ కృతి శెట్టి జంటగా నటించిన సినిమా మనమే. చివరగా ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శర్వానంద్. శర్వానం కెరియర్ లో దాదాపు 35 సినిమాలు చేసినా కూడా వాటిలో సక్సెస్ రేట్ తక్కువ. కానీ శర్వానంద్ పర్సనల్ వ్యక్తిత్వం వలన చాలామంది శర్వానంద్ కు ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా ఫెయిల్ అయిన కూడా శర్వానంద్ మాత్రం ఫెయిల్ అవ్వడానికి చెప్పొచ్చు. కొత్త కాన్సెప్ట్ సినిమాలకు ఎప్పుడు స్వాగతం పలుకుతూనే ఉంటాడు. అయితే శర్వానంద్ లోని కామెడీ యాంగిల్ చూసి చాలా రోజులైంది. మళ్లీ మనమే సినిమాతో అదే తీసే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.

Manamey Movie first review
Manamey Movie first review

సినిమా రిజల్ట్ ఏంటి

మనమే సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య బాగా తీశాడు. సినిమాలు ఫస్ట్ ఆఫ్ అంత చాలా డీసెంట్ గా ఉంది అని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే కొంతమేరకు బోర్ కొట్టిస్తుంది అని తెలుస్తుంది కానీ చివరి 30 నిమిషాలు మాత్రం సినిమా అదిరిపోయింది అంటూ కామెంట్స్ వినిపిస్తాయి. ఓవరాల్ గా ఈ సినిమా యావరేజ్ గా నిలిచినట్లు తెలుస్తోంది.

- Advertisement -

సినిమాలోని ప్లస్ పాయింట్

శర్వాను చాలా అందంగా చూపించాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. శర్వానంద్ లుక్స్ మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. సర్వానంద్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ మొత్తం సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తేనే మనకు కొంత అవగాహన వచ్చింది. సినిమాలో కూడా అదే లెవెల్లో శర్వానంద్ నటించిన ఎంటర్టైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ అద్భుతంగా వర్కౌట్ అయినట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో శివ కందుకూరి కనిపించనున్నాడు. అయితే ఈ విషయం ఇప్పటివరకు టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ బయటకు రాలేదు. ఈ సినిమా సెకండ్ హాఫ్ సంబంధించి మొత్తం శివ కందుకూరి రోల్ పై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని గట్టిగా చెప్పొచ్చు.

రేపు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య తో పాటు కృతి శెట్టికి హిట్టు పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉప్పెన సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఇప్పటివరకు కృతికి ఒక హిట్ సినిమా కూడా లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు