Manamey Pre-release event: ప్లేస్ మారింది కానీ గెస్ట్ మారలేదు

Manamey Pre-release event: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కు సంబంధించి రేపు రిజల్ట్స్ రానున్నాయి. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ కి సిద్ధమైన సినిమాలలో మనమే సినిమా ఒకటి. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. శర్వానంద్ కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. హృదయం సినిమాకి సంగీతం అందించిన అబ్దుల్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. సినిమాలో దాదాపు 16 పాటలు వరకు ఉంటాయని శ్రీరామ్ ఆదిత్య తెలిపారు.

సరైన సినిమా ఒకటి కూడా లేదు

ఇక రీసెంట్ టైమ్స్ లో థియేటర్స్ లో సరైన సినిమా ఒకటి కూడా రాలేదు. టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద సరైన కమర్షియల్ హిట్ ఒకటి కూడా పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఇక రీసెంట్గా గ్యాంగ్ ఆఫ్ గోదావరి, భజే వాయువేగం, గం గం గణేశా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడ్డాయి. అయితే గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రస్తుతం భజే వాయువేగం సినిమా వేగం పెంచుకొని మంచి పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తుంది.

Sharwanand Manamey

- Advertisement -

చరణ్ రావడం పక్కా

ఇకపోతే జూన్ 7వ తారీఖున మనమే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు సడన్ గా అనౌన్స్ చేశారు పీపుల్ మీడియా సంస్థ. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. మొదట ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలో చేయనున్నట్లు కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఉన్న 144 సెక్షన్ ప్రకారం అక్కడ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్టు సమాచారం వస్తుంది. అయితే ఈవెంట్ హైదరాబాద్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచి చెబుతున్నట్లు ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ తేజ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు