Manamey: బేబమ్మ అంచనాలన్నీ ఈ సినిమా మీదే

Manamey: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ పరిచయం అవుతూ వచ్చారు. అయితే వాళ్లంతా ఎక్కువ కాలం నిలబడలేదు. కొన్ని సినిమాలు చేస్తూ మళ్ళీ కనుమరుగై పోయారు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. కొందరికి హిట్ సినిమా పడినా కూడా ఆ తర్వాత అవకాశాలు లేకుండా పోతాయి. అవకాశాలు వచ్చినా కూడా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాన్ని సాధించవు. ఇలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అందులో కృతి శెట్టి ఒకరు.

ఉప్పెన తో పరిచయం

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడుగా పరిచయమైన సినిమా ఉప్పెన. ఈ సినిమా తోనే మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో బేబమ్మ అనే పాత్రలో కనిపించింది కృతి శెట్టి. ఈ సినిమా తర్వాత కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కృతి బయట ఏ ఫంక్షన్ లో కనిపించినా కూడా బేబమ్మ బేబమ్మ అంటూ చాలామంది ప్రేక్షకులు అరవడం మొదలుపెట్టారు. అయితే ఉప్పెన సినిమా తర్వాత ఇప్పటివరకు ఏమి కెరియర్ లో సరైన హిట్ సినిమా పడలేదు.

వరుస అవకాశాలు

ఉప్పెన సినిమాతో హిట్ అందుకున్న తర్వాత కృతి శెట్టికి వరుసగా అవకాశాలు వచ్చాయి. నాని సరసన శ్యాం సింగ రాయ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన, కృతికి మాత్రం సరైన గుర్తింపు రాలేదు. ఈ సినిమా తర్వాత చేసిన బంగారు రాజు సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా మంచి హిట్ అవుతుందని చాలామంది అంచనా వేశారు కానీ ఆ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. అయితే మొదటి సినిమా తర్వాత ఇప్పటివరకు ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది.

- Advertisement -

Krithi Shetty

అంచనాలన్నీ మనమే సినిమా పైన

కృతి అంచనాలన్నీ కూడా మనమే అనే సినిమా పైన ఉన్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.శర్వానంద్ కి జంటగా కృతి కనిపిస్తోంది. అయితే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లో మ్యూజిక్ కీలకంగా ఉండబోతుందని ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాకి అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కానుంది. అయితే ఉప్పెన సినిమా తర్వాత ఇప్పటివరకు సరైన హిట్టులేని కృతికి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలామంది నమ్మకం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు