Manchu Lakshmi: తండ్రి పై అలాంటి వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మీ..!

Manchu Lakshmi..తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు పెట్టింది పేరు మంచు కుటుంబం.. ముఖ్యంగా మోహన్ బాబు ఫ్యామిలీ పేరు చెప్పగానే చాలామంది క్రమశిక్షణకి మారుపేరు అని చెబుతూ ఉంటారు. మోహన్ బాబు ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో పాత్రలలో నటించి ప్రేక్షకులను మైమరిపించడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించారు. అలాగే మోహన్ బాబు కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా హీరోలుగా నటిస్తూ ఉన్నారు. ఇక ఈయన గారాల కూతురు మంచు లక్ష్మి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటిస్తూ ..మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ముంబై కి వెళ్లడానికి ఇంట్లో అడ్డగించారు..

Manchu Lakshmi: Manchu Lakshmi who made such comments on father..!
Manchu Lakshmi: Manchu Lakshmi who made such comments on father..!

సక్సెస్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ టాక్ షోలను చేస్తూ ఉంటుంది మంచు లక్ష్మి. మంచు లక్ష్మి ప్రస్తుతం హైదరాబాద్ వదిలి ముంబైలో నివసిస్తున్నది.. అయితే ముంబైకి రావడానికి గల కారణాలు ఏంటి? అనే విషయం పైన ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి వెల్లడించింది. అయితే గత కొద్దిరోజులుగా మంచు కుటుంబంలో విభేదాలు వచ్చాయనే విధంగా వార్తలు వినిపించాయి.. ఈ విషయాల పైన కూడా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. తాను హైదరాబాదు వదిలి ముంబైకి రావడానికి తన కుటుంబం చాలా అడ్డంకిలా మారిపోయింది అంటూ వెల్లడించింది. తనను ముంబైకి పంపించాలి అంటే ఇంట్లో వాళ్ళు కాస్త సంకోచించారు అంటూ తెలిపింది.

రకుల్ , రానా వల్లే ముంబైకి వెళ్లాను..

ముంబై కి వచ్చిన కొత్తలో తన స్నేహితురాలు అయిన రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో ఉండేదాన్ని అంటూ తెలిపింది మంచు లక్ష్మి. ముంబై కి రావడానికి రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒక కారణమని ఆమె ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చానని.. అలాగే టాలీవుడ్ హీరో రానా కూడా ఒకే చోట ఉండి పోకూడదని చెప్పడంతో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనిపించింది అని… అందుకే ముంబైకి వచ్చేసానంటూ తెలిపింది మంచు లక్ష్మి. అలాగే తాను పితృస్వామ్య బాధితురాలుగా తెలియజేసింది. ముఖ్యంగా దక్షిణాది ఇండస్ట్రీలో కూతుర్లను అక్కలను చెల్లెళ్లను సైతం ఎవరు కూడా సినిమాలలో నటింప చేయడానికి ఇష్టపడరు అని కూడా తెలియజేసింది.

- Advertisement -

ఇండస్ట్రీ లోకి రావడానికి మా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు..

తనకు కూడా ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఎదురైంది అంటూ వెల్లడించింది. ముఖ్యంగా తన తండ్రికి తాను నటించడం అసలు ఇష్టం లేదని.. అందుకే హీరోయిన్గా పెద్దగా ట్రై చేయలేదని కూడా తెలిపింది.. అలాగే తన సోదరులకు ఆఫర్లు దొరికినంత సులభంగా. తనకు దక్కడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అంటూ తెలియజేసింది మంచు లక్ష్మి. అయితే ఇండస్ట్రీలోకి బడా ఫ్యామిలీ నుంచి ఆడపిల్లలు రావాలి అంటే.. వారిని పంపించడానికి ఆ కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదని ఇది అన్ని ఇండస్ట్రీలలో కూడా ఉంది అంటూ వెల్లడించింది. అయితే తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది మాత్రం ప్రకాష్ కోవెలమూడి అంటూ వెల్లడించింది మంచు లక్ష్మి. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు