ManchuLakshmi : రోజుకు 12గంటలు ఈమెకి అదే పనట!

ManchuLakshmi : టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలలో ఒకటైన మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి స్టార్ గా నిలబడ్డ మోహన్ బాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాడు. అయితే ఆయన వారసత్వాన్ని నిలబెడతారనుకుని మంచు విష్ణు, మనోజ్, అలాగే మంచు లక్ష్మి లను గ్రాండ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయించాడు. అయితే వీళ్ళలో ఏ ఒక్కరూ అంతగా సక్సెస్ కాలేదు సరికదా ఓ మోస్తరు నటులుగా కూడా పేరుతెచ్చుకోలేకపోతున్నారు. ఉన్నంతలో మంచు మనోజ్ మంచి స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా, అలాగే మంచి మనసున్న హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ ఫ్యామిలీ పై ఇప్పుడు ఎలాంటి న్యూస్ వచ్చినా ట్రెండ్ అయి ట్రోలర్లకి మంచి బూస్టప్ అవుతుందన్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిన ఈ ఫ్యామిలీ కన్నప్ప తో ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నారు.

Manchu Lakshmi's tweet is going viral on social media

ట్రోలర్లకి స్పెషల్ బూస్టప్ ఇచ్చే మంచు లక్ష్మి..

ఇక మంచు ఫ్యామిలీ లో ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప విషయంలో ఈ మధ్యనే ట్రోలర్లకి అడ్డంగా బుక్ అవగా, తాజాగా మంచు లక్ష్మి కూడా ఇదే బాటలో వెళ్తుంది. ఇప్పటికే తనకు యాక్టింగ్ విషయంలో నెగిటివిటీ ఉంది. అయినా రీసెంట్ గా యక్షిణి అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించి, అందులో కూడా ట్రోల్ అయింది. మొన్నామధ్య ప్రమోషన్ లో ఓ అభిమానితో కావాలని కాళ్ళు మొక్కించుకుందని తెగ ట్రెండ్ చేసారు నెటిజన్లు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో తనకు స్టార్ హీరోల వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయని, రామ్ చరణ్ ఇంట్లో చాలా రోజులు ఉన్నానని ఏదేదో చెప్పుకొచ్చి వైరల్ అయింది. ఇప్పుడు తెల్లారగానే మరో ట్వీట్ తో నెట్టింట వైరల్ అవుతుంది.

- Advertisement -

12 గంటలు అదే పనట..

ఇక మంచు లక్ష్మి పాజిటివ్ గా వేసినా, ఒక్కోసారి నెగిటివ్ గా ట్రెండ్ అవుతూ ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియా లో ఓ ట్వీట్ వేసింది. తాను రాత్రి ఏడున్నర నుండి ఉదయం ఏడున్నర వరకూ నిద్రపోతూనే ఉందట. ఇందువల్ల తన బాడీకి చాలా రెస్ట్ దొరికి హాయిగా ఉందని చెప్పుకొచ్చింది. అది చూసిన నెటిజన్లు పన్నెండు గంటలూ అదే పనా? అని కొందరు.. ఇంతకు మించి ఏం చేస్తారు లే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు మాత్రం పెద్దగా రావడం లేదు. బహుశా సొంత నిర్మాణంలో ఏమైనా సినిమాలు చేస్తే చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఫ్యామిలిలో వచ్చే ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి. అయితే కన్నప్ప ఏమాత్రం నిరాశపరిచినా, క్లాసిక్ చిత్రాన్ని చెడగొట్టినందుకు దారుణంగా విమర్శలు ఎదుర్కోవాల్సివస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు