Manchu Manoj : పెళ్లి న్యూస్ కాదు.. కొత్త సినిమా

టాలీవుడ్ లో యంగ్ మల్టీ టాలెంటెడ్ హీరోస్ లో మంచు మనోజ్ ఒకరు. దొంగ దొంగది సినిమాతో 2004లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మనోజ్. ఆ తరువాత వేదం, కరెంట్ తీగ, మిస్టర్ నూకయ్య, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలతో ప్రేక్షకులని అలరించాడు. కానీ, మనోజ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

ఈ మంచు హీరో చివరి సారిగా హీరోగా 2017లో ఒక్కడు మిగిలాడు మూవీ కనిపించాడు. దీని తర్వాత 2018లో ఇది నా లవ్ స్టోరీ, ఆపరేషన్ 2019 వంటి సినిమాల్లో అతిథి పాత్రలో కనిపించాడు. అప్పటి నుంచి మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. అయినా ఈ మంచు వారి అబ్బాయి ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తున్నాడు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ నాయకుడు దివంగత భూమ నాగి రెడ్డి కూతురు భూమ మౌనికా రెడ్డితో మనోజ్ డేటింగ్ లో ఉన్నాడని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మనోజ్, మౌనిక రెడ్డి కూడా కొన్ని సార్లు బయట కనిపించారు. ఈ తరుణంలో గురువారం సోషల్ మీడియాలో మనోజ్ “చాలా రోజుల నుంచి ఒక స్పెషల్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. నా లైఫ్ లో కొత్త ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నందుకు చాలా ఆసక్తిగా ఉంది. అది జనవరి 20న అనౌన్స్ చేస్తాను. ఎప్పటిలాగే నాకు మీ ఆశీస్సులు కావాలి” అంటూ పోస్ట్ చేశాడు.

- Advertisement -

దీంతో అందరూ భూమా మౌనిక రెడ్డితో పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నాడని అనుకున్నారు. కానీ, నేడు మంచు మనోజ్.. తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. తన తర్వాత సినిమా పేరు ‘వాట్ ది ఫిష్’ (మనం మనం బరంపూరం) అనే టైటిల్ తో వస్తుందని వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ లో సాలిడ్ యాక్షన్ మోడ్ లో మనోజ్ ని చూపించారు.

ఈ సినిమా పోస్టర్ ను మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ, ”నేను సినిమాలు చేసి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకు, ఇన్ని సంవత్సరాలు మీరు న మీద చూపించిన ప్రేమకు చాల సంతోషంగా ఉంది, ఇక ఇప్పుడు దాన్ని మీకు తిరిగిచ్చే సమయం వచ్చింది, అందుకే ఈ క్రేజీ యాక్షన్ సినిమాతో మీ ముందుకు వస్తున్నా” అని ట్వీట్ చేసారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు