ManchuVishnu : దయచేసి అన్నీ ఆపేయండి.. మీమర్స్ కి మంచు విష్ణు వార్నింగ్..

ManchuVishnu : టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మోహన్ బాబు తనయుడిగా, మా ప్రెసిడెంట్ గా పేరున్న విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరిచయమై చాలా ఏళ్ళు అవుతున్నా, ఇండస్ట్రీలో తండ్రిలా అయితే నిలదొక్కుకోలేకపోతున్నాడు. అయినా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అయితే మంచు విష్ణు కి సోషల్ మీడియాలో మాత్రం స్నో అన్న గా మంచి ఫేమ్ ఉంది. చాలా సార్లు పలు వివాదాలతో ట్రోల్ కి గురయ్యాడు. అయితే లేటెస్ట్ గా ఇండస్ట్రీలో నాలుగురోజుల కింద జరిగిన యూటుబర్ వీడియో రచ్చ పై మంచు విష్ణు రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అవ్వడమే కాదు ఏకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసాడు. అసలు విషయానికి వస్తే… నాలుగు రోజుల కింద ఓ వ్యక్తి యూట్యూబ్ లో తండ్రీకూతురిపై అసభ్యంగా రియాక్ట్ అయ్యి పోస్ట్ చేసిన వార్త నెట్టింట సంచలనం అయిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ దీనిపై రియాక్ట్ అయ్యి, సీఎం రెస్పాండ్ అయ్యేలా చేసాడు. అంతే కాదు చాలా మంది సెలెబ్రిటీలు వాళ్లపై మండిపడ్డారు. ఇప్పుడు మంచు విష్ణు వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఏకంగా వీడియో చేసేసాడు.

Manchu Vishnu gave a strong warning to YouTubers

48 గంటల్లో ఆపేయండి..

తాజాగా యూట్యూబర్లపై మంచు విష్ణు (ManchuVishnu) వార్నింగ్ ఇస్తూ.. మ‌హిళ‌ల‌పై, ఫ్యామిలీ పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెడితే అస్సలు ఊరుకోనని హెచ్చరిస్తూ వీడియో పోస్ట్ చేసాడు. ఆ వీడియోలో ఇలా చెప్పుకొచ్చాడు… కొంతమంది తెలుగు వాళ్ళు యూట్యూబ్ లోనూ, ఇన్ స్టాగ్రామ్ లోనూ, ట్విట్టర్ లోనా అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల ఫ్యామిలీస్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నా తమ్ముడు సాయి వేసిన ట్వీట్ కు సీఎం సహా అందరూ రియాక్ట్ అయ్యారంటే.. అది ఎంత సెన్సిటివ్ ఇష్యూ నో ఆలోచించండి.. ఒక చిన్న పాప గురించి అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది. అసలు అలా మాటలు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. రెండు మూడు రోజులుగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కు యాక్షన్ తీసుకొమ్మని లెటర్స్, ఈమెయిల్స్ వచ్చాయి. వాళ్ళకి మర్యాదగా చెప్తున్నా యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు ఎంతమంది చేసారో 48 గంటల్లో అవన్నీ ఆపేయండి, లేదంటే ఆ తర్వాత యూట్యూబ్ కంపెనీ తో చర్చించి సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేస్తాం.. మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు… అలాగే మీమర్స్ కి కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు మంచి విష్ణు…

- Advertisement -

మీమర్స్ కి కూడా గట్టిగా వేసుకున్న విష్ణు..

ఇక సోషల్ మీడియాలో మీమెర్స్ పై కూడా మంచు విష్ణు మండి పడ్డాడు. మీమర్స్ చేసే ట్రోలింగ్ గురించి ప్రస్తావిస్తూ… మంచు విష్ణు బ్రహ్మానందం గురించి చెప్పుకొచ్చాడు… నిన్న బ్రహ్మానందం గారు నాకు కాల్ చేసి మాట్లాడారు. రేయ్ విష్ణు.. మీమ్స్ లో నా ఫోటోలు వాడుకుంటున్నారు. అలాంటివి నేను ఎంజాయ్ చేస్తాను.. కానీ జుగుప్సాకర వీడియోస్ లో కూడా వాడుతున్నారు. ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి అని నాకు చెప్పి బాధపడ్డారు”…. అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఫైనల్ గా “నేను సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా.. యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు, ట్రోలింగ్ వీడియోస్ చేసేవారికి అసభ్యకరంగా మాట్లాడేవారికి చెప్తున్నా.. 48 గంటల్లో వాటిని తీసేయండి. ఏదంటే యూట్యూబ్ ఛానెల్స్ తో మాట్లాడి, సైబర్ సెక్యూరిటీకి కంప్లైంట్ చేసి మీ ఛానల్ బ్యాన్ చేస్తామని మంచి విష్ణు చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు