Manchu Vishnu: యూట్యూబర్ ను బెదిరించింది నిజమే.. సాక్షాలతో సహా.!

Manchu Vishnu.. మంచు విష్ణు , యూట్యూబర్స్ మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ గొడవ మరో టర్న్ తీసుకుంది. యూట్యూబర్ చంద్రహాస్ ఓపెన్ గా మంచు విష్ణు కి ఛాలెంజ్ విసురుతున్నారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తానని , కాల్ రికార్డింగ్లు, మెయిల్స్ తో సహా అన్ని ఓపెన్ గా షేర్ చేస్తానని మంచు విష్ణు పై మండిపడుతూ తాజాగా ఇంకో వీడియో షేర్ చేయడంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది.

Manchu Vishnu: It's true that YouTuber was threatened.. with proofs.!
Manchu Vishnu: It’s true that YouTuber was threatened.. with proofs.!

యూట్యూబ్ ఛానల్స్ పై బ్యాన్ విధించిన మంచు విష్ణు..

అసలేం జరిగిందనే విషయానికొస్తే.. సినిమా వాళ్లపై అసభ్యకర వీడియోలు చేస్తున్న సోషల్ మీడియా యూట్యూబర్స్ పై టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.. 48 గంటల టైం ఇచ్చి ఆసభ్యకర కంటెంట్ డిలీట్ చేయని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లను రద్దు చేయించాడు. దీంతో చాలామంది సెలబ్రిటీలు మెచ్చుకుంటున్నారు కూడా.. అయితే ఇది యూట్యూబర్స్ కి మింగుడు పడడం లేదు.. తమ జీవన భృతిపై దెబ్బ తీసినట్లు వాపోతున్నారు కూడా..

మంచు విష్ణు పై విరుచుకుపడుతున్న యూట్యూబర్ చంద్రహాస్..

అయితే ఇప్పుడు తాజాగా చంద్రహాస్ అనే యూట్యూబర్ మంచు విష్ణు చేస్తున్న పనికి విమర్శిస్తూ ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. మంచు విష్ణు ఇన్ని రోజులు బ్లాక్ చేయించిన యూట్యూబ్ ఛానల్స్ నటీనటులపై అసభ్యకర వీడియోలు చేసినవి కావు. మంచు ఫ్యామిలీ అలాగే కన్నప్ప సినిమాను ట్రోల్ చేసిన ఛానల్స్. కన్నప్ప గురించి ట్రోల్స్ చేసినందుకే యూట్యూబ్ ఛానల్స్ ని బ్లాక్ చేయించాడు. చెప్పినవి 18 అయినప్పటికీ అనధికారికంగా చాలా ఛానల్స్ ను బ్లాక్ చేశాడు. ఎవరి ఫ్యామిలీ లను మేము ట్రోల్ చేయట్లేదు. నిన్నే ట్రోల్ చేస్తున్నామంటే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. ముఖ్యంగా మా అసోసియేషన్ ను నువ్వు ఇలా వాడుకుంటున్నావు అంటూ చంద్రహాస్ మండిపడుతూ కామెంట్లు చేశారు..

- Advertisement -

కన్నప్ప మూవీని ట్రోల్ చేసిన ఛానల్స్ పై వేటు..

అంతేకాదు ఛానల్స్ బ్లాక్ చేసిన తర్వాత బాధిత యూట్యూబర్ నిన్ను రిక్వెస్ట్ చేస్తే కన్నప్ప గురించి పాజిటివ్గా వీడియోలు తీస్తే ఛానల్స్ పై వేసిన స్ట్రైక్ తీస్తానని కూడా నువ్వు మెయిల్ చేశావు.. ఆ మెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి.. ఇవన్నీ కూడా నేను సోషల్ మీడియాలో పెట్టేస్తాను. నువ్వు చేసిన తప్పు ఒప్పుకో అంటూ యూట్యూబర్ ఒక వీడియో షేర్ చేయగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. అంతేకాదు ఈ వీడియో చూసిన చాలా మంది మంచు విష్ణు పై విమర్శలు గుప్పిస్తున్నారు ఇకపోతే మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఆ యూట్యూబ్ ఛానల్స్ కి మంచు విష్ణుకే తెలియాలి మరి దీనిపై మంచి విష్ణు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

విషయంపై స్పందించిన 24 ఫ్రేమ్స్ సంస్థ ..

అయితే తాజాగా మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ దీనిపై స్పందిస్తూ.. మా సంస్థ నుంచి మెయిల్స్ వచ్చినట్టు కొంతమంది ఫేక్ మెయిల్ ఐడి లతో మా సంస్థపై, కన్నప్ప సినిమా పై నెగిటివ్ ప్రమోషన్లు చేస్తున్నారు.. మేము సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. మంచు విష్ణు పై కొంతమంది కావాలని ఇలా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు అంటూ నోటీస్ విడుదల చేశారు.

అన్ని ఆధారాలు ఉన్నాయి.. తప్పు ఒప్పుకో..

దీంతో చంద్రహాస్ మళ్లీ ఇంకో వీడియో రిలీజ్ చేస్తూ యూట్యూబర్స్ ని బ్లాక్ మెయిల్ చేయడం నిజమే. ఆ మెయిల్స్ కూడా నిజమే. అన్ని తన దగ్గర ప్రూఫ్ లు ఉన్నాయి .మంచు విష్ణు వల్లే ఇదంతా వచ్చింది. కాల్ రికార్డింగ్ , నంబర్స్ ప్రతిదీ కూడా నా దగ్గర ఉన్నాయి.. మీ తప్పును యాక్సెప్ట్ చేయండి అంటూ తెలిపారు యూట్యూబర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు