Manchu Vishnu.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలుగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో మంచు కుటుంబం కూడా ఒకటి. ముఖ్యంగా కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు(Mohan Babu) విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో డైలాగ్ డెలివరీతో స్టార్ స్టేటస్ ను అందుకున్న ఈయన.. ఈ మధ్యకాలంలో తరచూ వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది యూట్యూబర్స్ పని కట్టుకొని మరీ వీరిపై ట్రోల్స్ చేస్తున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అన్నదమ్ముల మధ్య గొడవలు..
దీనికి తోడు అన్నదమ్ములిద్దరి మధ్య పొసగడం లేదు అనే వార్తలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని చెప్పవచ్చు. మంచు మనోజ్ (Manchu Manoj)రెండో పెళ్లి చేసుకోవడం మంచు మోహన్ బాబు కుటుంబానికి ఇష్టం లేదని , పైగా మంచు విష్ణు భార్య విరోనికా భూమా మౌనికను వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదనే వార్తలు తెరపైకి వచ్చాయి. అందుకే మంచు మనోజ్, భూమా మౌనిక వివాహ వేడుకల్లో కేవలం అతిధులుగానే వచ్చి వెళ్ళిపోయారు అంటూ ఫోటోలు , వీడియోలు కూడా నెట్టింట షేర్ చేశారు. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇలాంటి మంచు విష్ణు ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్లో ఉండగా.. ఈయనకి ఉన్న ఒకే ఒక్క మైనస్ తమ్ముడితో గొడవలే. గత కొద్ది రోజులుగా మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
మనోజ్ – మౌనిక పెళ్లి విష్ణుకి ఇష్టం లేదా..
మంజు మనోజ్ – భూమా మౌనికల పెళ్లి మంచు లక్ష్మి ఇంట్లో చాలా సింపుల్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు వచ్చారు. చివర్లో మంచు విష్ణు ఫ్యామిలీతో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంచు విష్ణు , మనోజ్ సన్నిహితులపై దాడికి దిగిన ఒక వీడియో మనోజ్ షేర్ చేసి తమ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి వీడియో కూడా డిలీట్ చేశారు. అలా వీరి మధ్య గొడవలు సాగుతున్న వేళ మౌనిక , మనోజ్ లకు బిడ్డ పుట్టగా.. బారసాల ఆహ్వానిక పత్రికలో మంచు విష్ణు దంపతుల పేరు కనిపించలేదు. దీంతో వీరు తమ మధ్య గొడవలు ఇంకా సమిసిపోలేదని అందరూ అర్థం చేసుకున్నారు.
గొడవలపై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు..
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటూ అన్నదమ్ముల మధ్య గొడవలపై క్లారిటీ ఇచ్చారు. కావాలనే కొంతమంది ఈ గొడవలు క్రియేట్ చేసి రాస్తున్నారని, నేను, నాన్నగారు ఒక దగ్గర ఉంటే, అక్క తమ్ముడు ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారని, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల తరచూ కలుసుకోవడం కుదరడం లేదు అంటూ తెలిపారు. మొత్తానికైతే సోషల్ మీడియాలో ప్రచారం చేసే వార్తలన్నీ కూడా నిరాధార వార్తలే అంటూ మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు.