Manjima Mohan: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్.. కట్ చేస్తే..!

Manjima Mohan: తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఇతర భాషల హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారు..అయితే అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయి బాగానే పాపులారిటీ అవుతున్నారు అలాంటివారిలో హీరోయిన్ మంజిమా మోహన్ కూడా ఒకరు.. ఈ ముద్దుగుమ్మ అన్వేషణ , అభినందన వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ఇదిలా ఉండగా.. తమిళ ఇండస్ట్రీలో హీరోగా పేరు పొందిన కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు.. ముఖ్యంగా కడలి సినిమాలో కూడా హీరోగా నటించారు. తమిళంలో కూడా ఎన్నో చిత్రాలలో నటించారు. ఈ హీరోని మలయాళ ముద్దుగుమ్మ మంజిమా మోహన్ ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు.

కడలి హీరోతో ప్రేమలో పడ్డ మంజిమా..

ముఖ్యంగా ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ చెన్నైలోని ప్రముఖ హోటల్లో ఘనంగా వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ ముత్తయ్య దర్శకత్వంలో వచ్చిన దేవరటం సినిమాలో మంజిమా, గౌతమ్ ఇద్దరు కూడా కలిసి నటించారు కూడా.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం చివరిగా మంజిమా మోహన్ మాత్రం 2023లో బూ అనే సినిమాలో నటించింది.. ఆ తర్వాత మరే సినిమాలో కూడా ఈమె నటించలేదు. అయితే అందుకు కారణం మాత్రం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ

ఆ విషయం మరింత బాధించింది..

Manjima Mohan: The heroine who got pregnant before marriage.. if cut..!
Manjima Mohan: The heroine who got pregnant before marriage.. if cut..!

ఒక ఇంటర్వ్యూలో మాత్రం మంజీమా మాట్లాడుతూ.. తాను వివాహానికి ముందే ప్రెగ్నెంట్ అని.. ఈ విషయం తమ మామ గారికి తెలియడంతో.. పెళ్లి పైన ఆసక్తి చూపించలేదంటూ చాలా తప్పుడు కథనాలు ప్రచారం చేశారని ఎమోషనల్ గా మాట్లాడింది మంజిమా.. అయితే ఈ ఒక్క విషయమే తమ కుటుంబాన్ని సైతం చాలా బాధించాయని.. తమ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈ వివాహం గురించి సంతోషంగా లేరని చెప్పారు.. కానీ తమ కుటుంబం మాత్రం చాలా సంతోషంగా ఉందంటూ తెలియజేసింది మంజిమా. చాలామంది తమను చూసి వెక్కిరించారు.. పెళ్లికి ముందే కొన్ని కామెంట్స్ ని కూడా ఎదుర్కొన్నానని తెలిపింది మంజిమా.

- Advertisement -

భర్త అండదండలతోనే..

అయితే వివాహమయ్యాక దీని గురించి తాను పెద్దగా ఆలోచించలేదని ఇలాంటివి ఎందుకు చదివి ఇబ్బంది పడతావు అంటూ తన భర్త తనకి చెబుతూ ఉంటారని తెలిపింది మంజిమా.. అయితే తన జీవిత భాగస్వామికి తాను సరిపోననే కామెంట్స్ వింటే తనకు చాలా బాధ కలుగుతుందని ఈ విషయంలో తాను ఫెయిల్యూర్ అయ్యానని కానీ గౌతం ఎప్పుడు తనని మాత్రం సపోర్ట్ గా చేస్తూ ఉంటారని వెల్లడించింది మంజిమా. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అయితే ఈమె అభిమానులు మాత్రం ఈ విషయాలపై మంచి మాకు అండగా నిలుస్తున్నారు ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా మీ భాగస్వామి మీకు అండగా నిలిచారు .. ఇక ఈ విషయంలో మీరు మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేదు.. అన్నింటిని విని వదిలేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా మంజిమాకి ఫ్యాన్స్ సపోర్టు కూడా ఎక్కువగా ఉంది అనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు