Rajinikanth: రజినీ కాంత్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన మారి సెల్వరాజ్

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, ఇది కేవలం పేరు కాదు ఇది ఒక ప్రభంజనం. మామూలుగా రజనీకాంత్ తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులు. రజనీకాంత్ సినిమా వస్తుంది అని అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఒకప్పుడు థియేటర్ దగ్గర క్యూ కట్టేవాళ్ళు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ హవా కొంతమేరకు తగ్గింది అని అనుకుంటున్న తరుణంలో జైలర్ సినిమాతో బీభత్సమైన హిట్ సాధించి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు రజిని.

బీస్ట్ సినిమాతో ఫెయిల్యూర్ చవిచూసిన నెల్సన్ జైలర్ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ జైలర్ 2 సినిమాని రజనీకాంత్ తో చేయనున్నాడు నెల్సన్. ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పాల్గొంటున్నారు. ఈ సినిమాకి వెట్టైయాన్ అని టైటిల్ ను ఖరారు చేసినట్లు అందరికీ తెలిసిందే.

జై భీమ్ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు టీజే జ్ఞానవేల్. ఆ తర్వాత రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కుతుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, దగ్గుపాటి రానా వంటి చాలామంది ప్రముఖులు కనిపించనున్నారు.

- Advertisement -

Rajinikanth

రజినీకాంత్ మారి సెల్వరాజ్ కాంబినేషన్లో సినిమా ఉండబోతుంది అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. దీని గురించి మారి సెల్వరాజ్ రోజు సహజంగా స్పందించారు. మారి సెల్వరాజ్ చేసిన మూడు సినిమాలు కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి తనను ప్రోత్సహించారు. రజినీకాంత్ గారు నాతో సినిమా చేయాలి అని ఉంది అని చాలాసార్లు చెప్పారు. అది ఎప్పుడు జరుగుతుందో కానీ తెలియదు ఖచ్చితంగా జరుగుతుంది అంటూ సెల్వరాజ్ క్లారిటీ ఇచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు