MaruthiNagarSubrahmanyam : సుబ్రహ్మణ్యంకి డబ్బులు ఇచ్చినా చూశారా లేదు.. కలెక్షన్స్ నిల్లు

MaruthiNagar Subrahmanyam : విలక్షణ నటుడు రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన సిఎంమా “మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం”. లక్ష్మణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించడం జరిగింది. అయితే ఈ వారమే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమా వస్తున్నట్టు కొన్ని రోజుల ముందువరకు చాలా మందికి తెలీదు. రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్స్ టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేసారు. అక్కడి వరకు ఒకే గాని, సినిమాపై అంచనాలు పెరగలేదు. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ (Allu arjun) వచ్చి మాట్లాడిన స్పీచ్ ఎప్పుడైతే ట్రోల్ అయిందో, అప్పుడే మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం (MaruthiNagar Subrahmanyam) సినిమా గురించి జనాలకు తెలిసింది. అయితే ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా జనాలని మాత్రం థియేటర్లకు రప్పించడం లేదు.

Maruthi Nagar Subrahmanyam was rejected by the theater audience

టికెట్ పై బంపర్ ఆఫర్… అయినా చూడట్లేదు…

అయితే మారుతీ నగర్ సినిమాకు డీసెంట్ టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు రావడం లేదన్నది వాస్తవం. మేకర్స్ పోస్టర్స్ లో కలెక్షన్ల వదులుతున్నా, ఒక్క థియేటర్ కూడా ఫుల్ కావడం లేదు. అయితే ప్రేక్షకులను ఎలాగైనా థియేటర్లకు రప్పించాలని, మొన్నా మధ్య మల్టీ ప్లెక్స్ లో టికెట్స్ రేట్ ని తగ్గించారు. అయినా జనాలు రాలేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఏకంగా లక్ష రూపాయలు గెలుచుకునే ఆఫర్ ని ప్రకటించారు మేకర్స్. అయినా ప్రేక్షకులు థియేటర్ల వైపు తొంగి చూడడం లేదు.

- Advertisement -

కంటెంట్ లోపమా? ప్రమోషన్ లోపమా?

అయితే ఈ సినిమా పరంగా చూస్తే, అంత కొత్త కంటెంట్ కాకపోయినా, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేలానే ఉందని టాక్. కానీ జనాలని ఆకర్షించడంలో మాత్రం విఫలమవుతుంది. దానికి కారణం ప్రమోషన్ లోపమా? లేక కంటెంట్ ఆ అన్న చర్చ నెట్టింట నడుస్తుంది. అయితే సినిమా బాగుంటే ప్రేక్షకుడే డబ్బులు ఇస్తాడు, సినిమా బాగా లేకపోతే మనం ఎంత ఇచ్చినా ప్రేక్షకులు సినిమా అయితే చూడరు. అసలు చిత్ర యూనిట్ ముందు నుండే సినిమాకు ఎందుకు ప్రమోషన్స్ చేసి ఉంటే ఇలాంటి ఓపెనింగ్స్ వచ్చేవి కావని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా ఓ రకమైన నెగిటివిటీకి కారణం అయి, మెగా ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ వంటి వారు సినిమాని చూడకుండా చేశాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా పుంజుకోవడం కష్టమేనని అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు