Maruthi Nagar Subramanyam: సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చారా.? మీ డబ్బా కొట్టుకోడానికి వచ్చారా.?

Maruthi Nagar Subramanyam: ఒక మంచి సినిమాకి ప్రేక్షకులు ఎప్పుడు ఆదరణ చెబుతూనే ఉంటుంది. ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా దానికి బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. ఒకప్పుడు చిన్న సినిమాను బతికించండి అంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నినాదాలు చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న సినిమాలకే ప్రేక్షకులు మంచి ఆదరణ చూపిస్తున్నారు. ముందు చాలా చిన్న సినిమాలు తీసిన దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రీసెంట్ టైమ్స్ లో పరిచయమయ్యారు. ఇప్పుడు వాళ్లే పెద్ద పెద్ద సినిమాలు తీసే స్థాయికి వచ్చారు. మామూలుగా చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమా గొప్ప సినిమా అని ఉంటుంది అనే ఆలోచన ధోరణి చాలామందికి వచ్చేసింది.

ఈ ఆగస్టు నెలలో రిలీజ్ అయిన పెద్ద సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ వంటి చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ ని సాధించి మంచి వస్తువులను రాబట్టాయి. ఇదే నెలలో రిలీజ్ కాబోతున్న సినిమా మారుతి నగర్ సుబ్రమణ్యం. ఈ సినిమాలో రావు రమేష్ మెయిన్ లీడ్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సందర్భంగా ఈ సినిమా ఈవెంట్ ని కండక్ట్ చేశారు. ఈవెంట్ కి సుకుమార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

మామూలుగా ఒక సినిమాను ప్రమోట్ చేయడానికి పెద్ద హీరోలు వస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్కి ఉన్న స్టార్ డం గురించి చెప్పాల్సిన అవసరం లేదు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ ఒక సినిమాని ప్రమోట్ చేస్తే అది కొంచెం ఎక్కువ రోజులు ఆడే అవకాశం ఉంది. అది కూడా ఆ సినిమాలో కంటెంట్ ఉంటే. ఇక అల్లు అర్జున్ ఈ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ పుష్ప సినిమా గురించి, తన ఫ్యాన్స్ గురించి, ఇన్ డైరెక్ట్ గా నంద్యాల ఇష్యూస్ గురించి మాట్లాడారు.

- Advertisement -

Maruthi Nagar Subramanyam

 

సినిమా గురించి మాట్లాడిన కూడా అవి పెద్దగా హైలెట్ కాలేదు. ఇప్పుడు ఏ సోషల్ మీడియా వేదికలో చూసిన అల్లు అర్జున్ మాట్లాడిన పుష్ప వీడియో, ఫ్రెండ్షిప్ వీడియో ఇవ్వు మాత్రమే ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చూసిన కొంతమంది సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చారా లేదంటే మీ డబ్బా కొట్టుకోవడానికి వచ్చారంటూ నెగిటివ్ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు