Maruti Nagar Subrahmanyam: 20 నిముషాలు మాట్లాడాడు కానీ సినిమా పేరు తెలియదు

Maruti Nagar Subrahmanyam: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన కొత్త బంగారులోకం సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నారు రావు రమేష్. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన మగధీర సినిమా కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఖలేజా సినిమా విపరీతమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాల్లో రావు రమేష్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండేది. అలానే శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో కూడా రావు రమేష్ కి ప్రత్యేకమైన పాత్రలు ఉండేవి. అలా ఎన్నో సినిమాల్లో ప్రముఖ నటుడుగా రాణిస్తూ వచ్చారు రావు రమేష్.

ప్రస్తుతం రావు రమేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా మారుతి నగర్ సుబ్రమణ్యం. ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను పిబిఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్స్ పై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య లు నిర్మించారు. ఈ సినిమాను సుకుమార్ భార్య తబిత సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 23న రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దీనికి సుకుమార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్లుగా హాజరయ్యారు.

Maruthi Nagar Subramanyam

- Advertisement -

ఈ ఈవెంట్లో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావించారు. సినిమా గురించి కూడా మాట్లాడారు. అయితే అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవ్వకుండా ఏవేవో వైరల్ అయిపోయాయి. ఫ్యాన్స్ కు ఐ లవ్ యూ చెప్పడం, నంద్యాల ఇష్యూ ఇలా ఒక్కొక్కటి హైలెట్ అవుతూ వచ్చాయి. ఇకపోతే ఈ స్పీచ్ చివర్లో అల్లు అర్జున్ సినిమా పేరును మర్చిపోయి వెనక్కి తిరిగి చదువుకున్నాడు, అక్కడికి అర్థం కాకపోతే పక్కనున్న సుకుమార్ కు కూడా అడిగారు. బేసిగ్గా మర్చిపోవడం అనేది కామన్ గా జరుగుతుంది. కానీ 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత సినిమా పేరు మర్చిపోవడం ఏంటి అని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు