Raviteja – Harish Shankar : ఈ ప్రాజెక్ట్ అయినా వీళ్ళను గట్టెక్కిస్తుందా?

మాస్ మహారాజా రవితేజ ఇటీవల “టైగర్ నాగేశ్వరరావు” అనే చిత్రంతో థియేటర్లలోకి వచ్చాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రవితేజతో పాటు ఆయన ఫ్యాన్స్ ని కూడా నిరాశపరిచింది. దీంతో ప్రస్తుతం రవితేజ తన నెక్స్ట్ మూవీస్ పై కాన్సన్ట్రేషన్ చేశాడు. ప్రస్తుతం ఆయన నటించిన “ఈగల్” రిలీజ్ కు రెడీ అవుతుండగా, ఆ తర్వాత రవితేజ చేసే మూవీ ఏంటి అనే విషయంపై టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రవితేజ – డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాల్సిన సినిమా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయింది అనే ప్రచారం టాలీవుడ్ లో జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో రవితేజ మరో యంగ్ డైరెక్టర్ తో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు అనే వార్త తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం విశ్రాంతి తీసుకునే మూడ్ లో లేని రవితేజ తన నెక్స్ట్ మూవీని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడట. ఈ ప్రాజెక్ట్ హిందీ మూవీ “రైడ్”కి రీమేక్ గా తెరకెక్కనుందని సమాచారం. ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, రవితేజ ఇమేజ్ కు సరిపోయేలా మార్చి తీయబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఫైనల్ డ్రాఫ్ట్ ను లాక్ చేసే పనిలో హరీష్ శంకర్ బిజీగా ఉన్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ లో సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని భావిస్తున్నారట.

“గబ్బర్ సింగ్” సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈయన 2019లో “గద్దలకొండ గణేష్” చిత్రంతో సందడి చేశాడు. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమాను చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. 2023లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ పలు కారణాలతో కొన్ని రోజుల్లోనే ఆగిపోయింది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత హరీష్ శంకర్ ఉస్తాద్” మూవీని ప్రకటించాడు. కానీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ లో హరీష్ కు సమస్యలు ఎదురయ్యాయి.

- Advertisement -

ఇక ప్రస్తుతం పవన్ పూర్తిగా తన సమయాన్ని రాజకీయాలకే కేటాయించడంతో వచ్చే ఆరు నెలల తర్వాత సినిమాను రీషెడ్యూల్ చేశారు. దాంతో హరీష్ శంకర్ “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీని వదిలేసి వేరే మూవీపై కాన్సన్ట్రేట్ చేశాడు. ఇప్పటికే పవర్ స్టార్ కోసం చాలా సమయాన్ని వేస్ట్ చేసుకున్న హరీష్ శంకర్… పవన్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేలోపు ఒక సినిమా పూర్తి చేసెయ్యొచ్చు అన్న ఆలోచనతో రవితేజతో ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు