MassReRelease : కింగ్ మాస్ వస్తున్నాడట.. మరి శివ సంగతి?

MassReRelease : టాలీవుడ్ లో మూడున్నర దశాబ్దాలుగా అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న నాగార్జున ఇప్పటికీ సీనియర్ స్టార్స్ గా యంగ్ స్టార్స్ కి సైతం పోటీని ఇస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అలాగే తన వారసులు కూడా తండ్రి బాటలో పయనిస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగష్టు 29న కింగ్ నాగార్జున బర్త్ డే వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా నాగార్జున నుండి స్పెషల్ అప్డేట్స్ రానున్నాయి. తన నెక్స్ట్ సినిమాల ఓపెనింగ్స్ కూడా జరుపుకోనున్నాయి. అయితే కింగ్ నాగ్ బర్త్ డే సందర్బంగా తన కెరీర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన సినిమా రీ రిలీజ్ కాబోతుంది.

Mass movie will be re-released on the occasion of Nagarjuna's birthday

మమ మాస్ వస్తున్నాడు..

నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో “మాస్” (MassReRelease) సినిమా ఒకటి. సరైన హిట్లు లేక సతమతమవుతున్న సమయంలో నాగార్జున కు మళ్ళీ శివ రేంజ్ హిట్ ని ఇచ్చిన సినిమా “మాస్”. రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారి తీసిన ఈ తొలి సినిమా 2004 లో వచ్చి ఊర మాస్ బ్లాక్ బస్టర్ అయింది. క్లాస్ సినిమాలతో వెళ్తున్న నాగార్జున ని లారెన్స్ కొంత గ్యాప్ తర్వాత మాస్ గా చూపించి ఇండస్ట్రీని షేక్ చేసారు. నాగార్జున ఫ్యాన్స్ కి కూడా ఫెవరేట్ చిత్రాల్లో ఇదొకటి. ఇక ఈ సినిమాను నాగార్జున బర్త్ డే సందర్బంగా ఆగష్టు 28న రీ రిలీజ్ చేస్తునట్టు మేకర్స్ ప్రకటించారు. కాసేపటికందే నాగ్ సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ నుండి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

- Advertisement -

మరి శివ వాయిదా పడినట్టేనా?

అయితే నాగార్జున బర్త్ డే స్పెషల్ గా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నామని ఆ మధ్య ప్రకటించారు. ఆగస్టు 29న రీ రిలీజ్ చేస్తున్నామని పోస్టర్స్ కూడా రీ రిలీజ్ చేసారు. కానీ ఇప్పుడు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. అనౌన్స్ ఏమి చేయలేదు కానీ, శివ అప్డేట్ మళ్ళీ ఇప్పటివరకు ప్రకటించలేదు, అలాగే మాస్ రీ రిలీజ్ అనౌన్స్ చేసారు. కాబట్టి శివ ని ప్రస్తుతం వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మరి మళ్ళీ ఆ సినిమాని ఎప్పుడు రీ రిలీజ్ చేస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు