Mr Bacchan : మిస్టర్ బచ్చన్ నుండి రేపు మాస్ సప్రైజ్.. కానీ వారికే ముందు?

Mr Bacchan :టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఫైనల్ గా ఆగష్టు 15న థియేటర్లలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ – రవితేజ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. ఇక వరుస ప్లాపుల్లో రవితేజ ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్లలో బిజీగా ఉంది. అలాగే సినిమా నుండి కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోమోలను రిలీజ్ చేస్తూ మిస్టర్ బచ్చన్ పై అంచనాలు పెంచేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మిస్టర్ బచ్చన్ యూనిట్ నుండి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Mass surprise tomorrow from Ravi Teja's Mr. Bachchan movie

మాస్ సప్రైజ్ కి రెడీ..

మిస్టర్ బచ్చన్ చిత్ర యూనిట్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఇక రవితేజ కూడా వరుస ఇంటర్వ్యూలను ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతుండగా, తాజాగా పీపుల్స్ మీడియా వారు ఇచ్చిన అప్డేట్ లో “హైదరాబాద్ మెట్రో కే యాత్రిగన్ కృపియా ధ్యాన్ దే… రేపటి నుండి మీ ప్రయాణంలో ఒక “మాస్ సర్ప్రైజ్” ఎదురుచూస్తోంది అని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ఇక ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఆడియన్స్ లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈ సప్రైజ్ కేవలం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్న వారికి మాత్రమే అంటూ చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే బహుశా చిత్ర యూనిట్ మెట్రో లో ట్రావెల్ చేయొచ్చు, లేదా సినిమా నుండి ఒక సాలిడ్ ప్రోమోని మెట్రో ట్రైన్స్ లో ప్లే చేయొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.

- Advertisement -

రెండు వారాల్లో మాస్ బ్లాస్ట్..

ఇక మిస్టర్ బచ్చన్ నుండి రేపు రాబోయే సప్రైజ్ లో ఒకవేళ ఏదైనా ట్రైలర్ గాని, మంచి ప్రోమో గాని రిలీజ్ చేస్తే, ఆ తర్వాత సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ అప్లోడ్ చేసేస్తారు. ఇక మిస్టర్ బచ్చన్ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, జగపతిబాబు విలన్ గా నటించాడు. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల, విశ్వా ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 15న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు