Abhinav Gomatam: “షేడ్స్” చూపించడానికి వస్తున్నాడు ..

టాలీవుడ్ లో ఈ జనరేషన్ కమెడియన్‌లలో వన్ అఫ్ ది బెస్ట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న నటుడు ‘అభినవ్ గోమటం’. “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో సూపర్ క్రేజ్ ని సంపాదించిన అభినవ్, ఆ తర్వాత వరుస సినిమాల్లో మంచి పాత్రలతో టాప్ కామెడియన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు లీడ్ రోల్‌లో సినిమాలు చేసే స్టేజ్ కి ఎదిగాడు. అయితే తాజాగా తిరుపతి రావు దర్శకుడిగా అభినవ్ గోమఠం హీరోగా ఓ సినిమా రాబోతుంది.

అభినవ్ కి ఎంతో పేరు తెచ్చిన ఈ నగరానికి ఏమైందిలో తాను వాడిన “మస్తు షేడ్స్ ఉన్నయ్ రా” నీలో అనే డైలాగ్ నే ఈ సినిమా పేరుగా నిర్ణయించగా, లాస్ట్ మంత్ లోనే “మస్తు షేడ్స్ ఉన్నాయిరా” అంటూ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేయగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.

ట్రైలర్ చూసాక ముందు ఊహించినట్టు ఇది ఫక్తు కామెడీ సినిమా అని కొందరు అనుకున్నా, కామెడీతో పాటు లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా, దాంతో పాటు చిన్నపాటి మెసేజ్ కూడా ఉంటుందని ట్రైలర్ చూసాక తెలుస్తుంది. గోదావరి ప్రాంతంలో ఒక చిన్న పలెటూళ్లో మనోహర్ అనే వ్యక్తి గొప్ప పెయింటర్ గాని, లేదా దానిపై మంచి బిజినెస్ గాని పెట్టి లైఫ్ లో సెటిల్ అవుదామని కలలు గంటూ, ఊళ్ళో వాళ్ళు అంటే మాటలు పడుతూ కష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో పరిచయమైన ఉమాదేవి తన కి ఎలా సహాయపడింది. మధ్యలో వీళ్ళ లవ్ ట్రాక్ ఏంటి? ఫైనల్ గా హీరో ఎంత వరకు వెళ్ళాడు అనేది తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాలి.

- Advertisement -

ఇక ట్రైలర్ చూడ్డానికి కాస్త రొటీన్ గానే ఉన్నా, డైరెక్టర్ తన స్క్రీన్ ప్లే బలంతో మ్యాజిక్ చేస్తాడనే నమ్మకం ఇచ్చింది. టెక్నికల్ వాల్యూస్ ఒకే అనిపించేలా ఉన్నాయి. ఇక వైశాలి రాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ను “కాసుల క్రియేటివ్ వర్క్స్” బ్యానర్ లో భవాని.కె, ప్రశాంత్.వి నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి 23న ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ సినిమాను రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ట్రైలర్ ద్వారా చెప్పడం జరిగింది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు